పంచె కట్టుకొని విజయ్ సంక్రాంతి సంబరం..!!

-

విజయ్ దేవర కొండ అర్జున్ రెడ్డి సినిమా తో యూత్ లో మంచి ఫాలోయిగ్ సాధించారు. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లెగర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా కావాల్సింది. కాని లైగెర్ సినిమా ఇటు పూరి జగన్నాథ్ ను అలాగే విజయ్ దేవరకొండ ను బాగా దెబ్బ కొట్టింది. ప్రస్తుతం విజయ్ శివ నిర్వాణ దర్శకత్వం లో ,సమంత  హీరోయిన్ గా ఖుషి అనే సినిమా చేస్తున్నాడు.

ప్రస్తుతం సమంత ఆరోగ్యం దెబ్బతినడం వల్ల షూటింగ్ కూడా సాధ్యం కావడం లేదు ఇక ఎప్పుడూ సమంత వస్తే అప్పుడే షూటింగ్ స్టార్ట్ అయ్యేలా ఉంది. దీనితో విజయ్ ఫుల్ ఖాళీగా ఉన్నాడు. ఈ ఖాళీ సమయంలో కొంత మంది దర్శకుల కథలు విన్నాడుఇక ఇటీవలే గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో మరో ప్రాజెక్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇందులో పవర్ ఫుల్ కాఫ్ పాత్రలో కనిపించనున్నట్లుగా అధికార పోస్టర్ ను బట్టి చూస్తే తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. దేవరకొండ ఇంట్లో మకర సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. కుటుంబంతో కలిసి పండుగను జరుపుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. విజయ్ షేర్ చేసిన ఫోటోలలో తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఉన్నారు.ఇద్దరూ ఫుల్ ట్రెడిషనల్ లుక్ లో అదరగొడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్ లో హల్చల్ చేస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news