సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌! .. హింట్ ఇచ్చిన రౌడీ హీరో

-

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్, రౌడీ హీరో విజయ్ దేవ‌రకొండ కాంబినేష‌న్ లో సినిమా రాబోతున్న‌ట్టు తెలుస్తుంది. ఈ విష‌యాన్ని విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక హింట్ ద్వారా తెలిపాడు. అయితే ఈ రోజు క్రియేటీవ్ ద‌ర్శ‌కుడు సుకుమార్ పుట్టిన రోజు. అయితే సుక్కు పుట్టిన రోజు సంద‌ర్భంగా సోషల్ మీడియా వేదిక‌గా చాలా మంది విశేష్ చేప్పారు. అలాగే రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ట్విట్ట‌ర్ వేదికగా సుకుమార్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపాడు. అయితే ఈ ట్వీట్ లో రౌడీ హీరో ఒక్క హింట్ ఇచ్చాడు. సుకుమార్ స‌ర్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపాడు.

అలాగే సుకుమార్ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకున్న‌ట్టు తెలిపారు. అలాగే ఒక హింట్ కూడా ఇచ్చాడు. సుకుమార్ తో సినిమా చేయ‌డానికి ఇక వేయిట్ చేయాల‌ను అంటూ ట్వీట్ చేశాడు. అలాగే ఈ ట్వీట్ లో 2021లో ది రైజ్, 2022లో ది రూల్, 2023 లో ది ర్యాంపేజ్ అని కూడా క్యాప్ష‌న్ రాసుకువ‌చ్చాడు. దీంతో వీరి కాంబినేష‌న్ లో సినిమా రావ‌డం క‌న్ఫామ్ అని తెలుస్తుంది. అయితే దీని పై అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. అయితే ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమా చేస్తున్నాడు. అలాగే సుకుమార్ పుష్ప పార్ట్ 2 ది రూల్ చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news