విజయ్ దేవరకొండ కు అవకాశం వస్తుందా..!!

-

లైగెర్ సినిమా ఇటు పూరి జగన్నాథ్ ను అలాగే విజయ్ దేవరకొండ ను బాగా దెబ్బ కొట్టింది. ఈ సినిమాకు పూరీ కంటే విజయ్ ఎక్కువ కష్టపడ్డాడు. తన మేక్ ఓవర్ గాని , సినిమా ప్రమోషన్ ను తన భుజాల మీద వేసుకొని కష్టపడ్డాడు. తన సినిమా ను పాన్ ఇండియా సినిమా గా ప్రమోట్ చేశాడు. కాని వారి ఆశలు తలకిందులు అయ్యి సినిమా ప్లాప్ గా నిలిచింది.విజయ్, సమంత తో ఖుషి సినిమా చేస్తున్నాడు.

నిజానికి ‘ఖుషి’ చిత్రాన్ని  2022 క్రిస్మస్ రిలీజ్ అనుకొని సాధ్యం కాదని  2023 వాలెంటైన్స్ డే స్పెషల్ గా  రావాలని చూశారు.కాని సమంత ఆరోగ్యం దెబ్బతినడం వల్ల ఇది కూడా సాధ్యం అయ్యేలా లేదు. ఎప్పుడూ సమంత వస్తే అప్పుడే షూటింగ్ స్టార్ట్ అయ్యేలా ఉంది.తాజాగా తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని కథలు వింటున్నాడు. కాని ఎప్పుడైనా ఒక సినిమా స్టార్ట్ అయిన వెంటనే ఎక్కువ మంది హీరోలు రెండో సినిమా లైన్ లో ఉంచు కుంటారు.కాని ప్రస్తుతం తర్వాత సినిమా పై క్లారిటీ లేకుండా పోయింది.

ప్రస్తుతం కొన్ని ప్రకటనల్లో నటిస్తూ ఉన్నాడు. ఇక తెలుగు బిగ్ బాస్ షో హోస్ట్ కోసం కూడా అడిగారట, ఆ షో వల్ల తనకే ఇబ్బంది అని , ఇంట్రెస్ట్ లేక వద్దని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పెద్ద డైరెక్టర్స్ ఎవ్వరూ ఖాళీగా లేరు. హీరో లు కూడా ఎవ్వరూ ఖాళీగా లేరు అందరూ రకరకాల ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉన్నారు.ప్రస్తుతం విజయ్ కూడా  తొందరగా ఒక ప్రాజెక్టు ను లైన్ లో పెట్టాలని తెగ తాపత్రయ పడుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news