“లైగర్” నుంచి దేవరకొండ న్యూడ్ పోస్టర్..సమంత హాట్ కామెంట్స్ !

-

టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా రూపొందుతోంది. పూరి జగన్నాథ్, నటి చార్మి, కరణ్ జోహార్ కలిసి పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. అయితే ఇవాళ లైగర్ సినిమా నుంచి విజయ్ దేవరకొండ మరో లుక్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం.

 

రౌడీ హీరో హాట్ బాడీని ప్రెసెంట్ చేస్తూ… ఫుల్ న్యూడ్ గా డిజైన్ చేశారు. ఒకచోట పూలతో కవర్ చేశారు. సిక్స్ ప్యాక్ బాడీ తో పవర్ఫుల్ తో అర్జున్ రెడ్డి అదరగొట్టేశాడు. బాడీ అలాగే పోస్టర్ అన్ని క్రేజీగా ఉండడంతో ఫ్యాన్స్ కు పిచ్చెక్కిపోతుంది. ఈ నేపథ్యంలోనే లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న విజయ్ దేవరకొండ పోస్టర్ పై సమంత హాట్ కామెన్స్ చేసింది. విజయ్ దేవరకొండ లుక్ అరాచకం అంటూ సమంత పేర్కొంది.

“విజయ్‌ కి రూల్స్‌ అన్నీ తెలుసు.. ఆ రూల్స్‌ బ్రేక్‌ కూడా చేయగలడు..అంతటి గట్స్‌ కేవలం విజయ్‌ కే ఉన్నాయి” అంటూ సమంత కామెంట్స్‌ చేసింది. అంతేకాదండోయ్‌… విజయ్‌ న్యూడ్‌ పిక్‌ ను తన ఇన్‌ స్టా గ్రామ్‌ లో స్టేటస్‌ పెట్టుకుంది. ఇలా స్టేటస్‌ పెట్టుకుని.. విజయ్‌ అంటే ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పింది సమంత. కాగా.. సమంత, విజయ్‌ ఖుషీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అటు… అనుష్క కూడా విజయ్‌ పోస్టర్‌ పై స్పందించింది. విజయ్‌ లుక్స్‌ అదుర్స్ అంటూ పోస్ట్‌ పెట్టింది. ఇక లైగర్‌ బ్యూటీ.. అనన్య పాండే కూడా విజయ్‌ కండలు చూసి.. ఆపుకోలేకపోయింది. ఇండియాలో అందరి టెంపరేచర్‌ పెంచేలా.. విజయ్‌ బాడీ ఉందంటూ హాట్‌ కామెంట్స్‌ చేసింది. ఇక వరుసగా టాలీవుడ్‌ స్టార్లు అంతా.. విజయ్‌ పోస్టర్‌ పై స్పందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news