షాకింగ్ పిక్.. విజయ్‌కి ముద్దు పెట్టిన విజయ్!!

-

ఏంటి విజయ్‌కు విజయ్ ముద్దు అని ఆశ్చర్యకరంగా చూస్తున్నారా!. విజయ అంటే మన విజయ్ దేవరకొండ కాదులేండీ. దళపతి విజయ్‌కు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ముద్దు పెట్టేశాడు. అదీ అందరి ముందే. ప్రస్తుతం వీరిద్దరి పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అసలింతకు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

ఖైదీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు లోకేష్ కనకరాజ్.. దళపతి విజయ్‌తో మాస్టర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దళపతిని ఢీ కొట్టే పవర్ ఫుల్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.

తాజాగా ఈ మూవీ నుంచి కుట్టి స్టోరీ అనే పాటను విడుదల చేసింది. యూట్యూబ్‌లో ఈ పాట సంచలనంగా మారింది. ఈ మూవీ నుంచి ప్రస్తుతం ఓ అప్‌డేట్ వచ్చేసింది. విజయ్, విజయ్ సేతుపతి ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేశారట. ఈ క్రమంలో విజయ్ సేతుపతి దళపతికి ప్రేమగా ఓ ముద్దు పెట్టి వీడ్కోలు చెప్పాడు. దీనికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news