కమల్ హాసన్ ‘విక్రమ్’ తొలి రోజు కలెక్షన్స్..ఎన్ని కోట్లంటే?

-

లోకనాయకుడు కమల్ హాసన్ -లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘విక్రమ్’ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు చక్కటి స్పందన లభిస్తోంది. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలక పాత్రలు పోషించిన ఈ పిక్చర్..కు అనిరుధ్ మ్యూజిక్ అందించారు.

‘మహానగరం, ఖైదీ, మాస్టర్’ చిత్రాల తర్వాత లోకేశ్ కనకరాజ్ నుంచి వచ్చిన ఈ సినిమా అంచనాలను మించి ఉన్నదని కమల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘విక్రమ్: హిట్ లిస్ట్’ పేరుతో హీరో నితిన్ విడుదల చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఫిల్మ్ కు చక్కటి స్పందన లభిస్తోంది.

దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ సినిమాతో కమల్ హాసన్ సినీ ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు రూ.45 కోట్లకు పైగానే వసూళ్లు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రూ.3.70, కేరళలో రూ.5.20 కోట్లు, తమిళనాడులో రూ.20 కోట్లు, ఓవర్సీస్ లో రూ.11.50 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా ఈ సినిమా వారాంతం వరకే రూ.వంద కోట్ల క్లబ్ లోకి ఈజీగా చేరొచ్చని అంటున్నారు సినీ పరిశీలకులు. కమల్ హాసన్ ..మాస్ యాక్షన్ థ్రిల్లర్ లో ఇరగదీశాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news