తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఏ పేపర్ చూసినా కేసీఆర్, కేటీఆర్ ఫొటోస్ మాత్రమే ఉన్నాయని మండిపడ్డారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. శ్రీకాంతాచారి, తెలంగాణ కోసం అమరులైన ఒక్కరి ఫోటో కూడా కనపడలేదని అన్నారు. మోసగాళ్ల ఫోటో ఫ్రంట్ పేజీలో వేయడం సిగ్గుచేటని అన్నారు. యావత్ భారతదేశంలో మోస్ట్ సెర్చేడ్ మ్యాన్ గా నా పేరు ఉంది అది నా రేంజ్ అన్నారు పాల్.
శ్రీకాంతాచారి తండ్రిని చంపేస్తామని బెదిరిస్తున్నారని, శ్రీకాంతాచారి తండ్రికి ఏమైనా జరిగితే కేసీఆర్ కుటుంబానిదే బాధ్యత అని అన్నారు. మేము అమరుల కుటుంబాల నుంచి 20 మందిని అసెంబ్లీకి పంపిస్తామన్నారు. కెసిఆర్, తెలంగాణ ప్రభుత్వం వచ్చిందే అమరుల ప్రాణత్యాగం వల్ల అన్నారు. అన్ని రాజకీయ పార్టీల లాగా నాకు బూతులు రావు అన్నారు కే ఏ పాల్. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని అన్నారు.