“వినరో భాగ్యము విష్ణు కథ” వాయిదా..కొత్త డేట్ ఇదే

-

యంగ్‌ టాలెంటెడ్‌ హీరో కిరణ్ అబ్బవరం కథనాయకుడిగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా తెరకెక్కింది. అయితే.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు నిర్మించగా.. మురళీ కిషోర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కిరణ్ జోడీగా కశ్మీర పరదేశి అలరించనుంది. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకి బాణీలను సమకూర్చాడు.

ఇక ఇటీవలే హీరో సాయితేజ్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. హిరోయిన్ తో హీరో లవ్ .. ఆమె తండ్రితో కామెడీ .. విలన్ గ్యాంగ్ తో యాక్షన్ అంశాలు కలగలిసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మరి ఈ సినిమా అయితే ఈ వచ్చేవారం ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ లాక్ చేశారు. మరి ఈ సినిమా అయితే ఈ రోజు నుంచి మరో రోజుకి వాయిదా పడినట్టుగా టాక్ వచ్చింది. మరి ఈ సినిమా ఓ రోజు తర్వాత అంటే ఫిబ్రవరి 18న రిలీజ్ అవుతున్నట్టుగా రాగా, ఇప్పుడు దీనిపై అధికారిక అప్డేట్ అయితే ఇప్పుడు వచ్చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version