పోసాని శవానికి దండ.. పక్కన నందిని రాయ్ డ్యాన్స్..

-

అందాల ముద్దు గుమ్మ నందిని రాయ్.. తెలుగు సినిమాల తో పాటు వేరే భాషల సినిమాలలలో మెరిసినా…. అంతగా ఫేమ్ రాలేదు ఈ అమ్మడికి. కానీ ఏ ముహూర్తాన బిగ్ బాస్ షో లో అడుగు పెట్టిందో కాని… ఒకే సారి సెలబ్రెటీలా మారిపోయి అందరి చూపును తన వైపుకు తిప్పుకుంది. నందిని రాయ్ క్యూట్ లుక్స్ కు బుల్లి తెర ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆహా తెలుగు ఓటీటీ సంస్థ నిర్మించిన ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్ వెబ్ సిరీస్ లో నటించిన ఈ బ్యూటీ… మూవీలో విలక్షణ నటుడు పోసాని కృష్ణ మురళి డెడ్ బాడీ ముందర గంతేసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో ఏముందంటే…. పోసాని ఫోటో కు దండపడగా… ఆనందంతో అమ్మడు శవం మీద పూలు చల్లి… కోలీవుడ్ నటుడు ధనుష్ నటించిన జగమే తంద్రం సినిమాలో ని పాటకు స్టెప్పులేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియోను ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారుతోంది. కానీ… అసలు విషయమేంటంటే.. నందిని రాయ్ స్టెప్పులేసే సీన్ ఆ సిరీస్ లో లేదు. కానీ తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఈ వీడియోను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు ట్యాగ్ చేస్తూ… పోస్ట్ చేసింది. దీంతో ఇది చూసిన వారందరూ… అమ్మడు డాన్య్స్ కు తెగ ఫిదా అయిపోతున్నారు.

కాగా ఈ వెబ్ సిరీస్ లో ఈ అమ్మడు బోల్డ్ క్యారెక్టర్ లో నటించి మెప్పించింది. తెలుగు నటుడు ప్రియదర్శి కూడా.. ఈ సిరీస్ లో మెరిశారు. రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ వెబ్ సిరీస్.

 

View this post on Instagram

 

A post shared by Nandini Rai (@nandini.rai)

Read more RELATED
Recommended to you

Latest news