టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ: సోషల్ మీడియా వార్…ఈటెల రాజేందర్ అలా చేశారా?

-

తెలంగాణ రాజకీయాల్లో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుగుతుంది. కేవలం మీడియాలోనే కాదు సోషల్ మీడియాలో సైతం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మాదిరిగా మాటల యుద్ధం నడుస్తోంది. అలాగే ఈటల రాజేందర్ బీజేపీలోకి వచ్చాక మరింతగా ఇది జరుగుతుంది. ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నిక పోరు నేపథ్యంలో టీఆర్ఎస్ సోషల్ మీడియా ఈటలని గట్టిగే టార్గెట్ చేసింది.

టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ

అనూహ్యంగా ఈటెల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు రావడం, కేసీఆర్, ఈటెల రాజేందర్ ని  మంత్రి పదవి నుంచి తొలగించడం జరిగాయి. అలాగే ఈటల టీఆర్ఎస్‌ని వదిలి బీజేపీలోకి వచ్చి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హుజూరాబాద్ బరిలో మళ్ళీ నిలబడ్డారు. ఈ పోరులో పైచేయి సాధించాలని టీఆర్ఎస్, బీజేపీలు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుని విమర్శలు చేసుకుంటున్నారు.  ,

తాజాగా ఈటెల రాజేందర్ ని టీఆర్ఎస్ సోషల్ మీడియా టార్గెట్ చేసింది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అవడానికి ముందు తనపై వచ్చిన అభియోగాలకు సంజాయిషీ ఇస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాసినట్టుగా చెబుతున్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంటే తెలుగులో చాలా మేటర్ రాసి ఉంది. కాకపోతే దాని పూర్తి సారాంశం వచ్చి, తాను తప్పు చేశానని, ఆ తప్పుని సరిచేసుకునే అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ని ఈటెల రాజేందర్ కోరినట్లు రాసి ఉంది. అయితే ఎంత తప్పు చేసినవారైనా బహిరంగంగా లేఖలు రాస్తారా? అలాగే అందులో ఈటల, కేసీఆర్‌ని బాగా బ్రతిమలాడుకున్నట్లు రాశారు.

అయితే ఇదంతా టీఆర్ఎస్ సోషల్ మీడియా పని అని చెప్పి బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈటెల రాజేందర్ ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలా లేఖ సృష్టించారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అసలు ఈటెల రాజేందర్ ఎప్పుడు తన లెటర్ ప్యాడ్‌పై తెలుగులో రాయలేదని చెబుతున్నారు. అంటే ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న గేమ్ అని అంటున్నారు. ఏదేమైనా బయట కంటే సోషల్ మీడియాలో రాజకీయాలు మరీ ఊహకు అందని విధంగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news