బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో షారుఖ్ ఫ్యాన్ అయిన ఓ అమ్మాయి.. షారుఖ్‌ను కలిసేందుకు వచ్చింది. ఈవెంట్లో షారుఖ్ ఎంటర్ అవ్వగానే అతడి వద్దకు వెళ్లి బలవంతంగా ముద్దు పెట్టేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
దుబాయ్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో మంగళవారం షారుఖ్ పాల్గొన్నాడు. కార్యక్రమం అనంతరం అక్కడి అభిమానులను కలిశాడు. కొంతమంది ఆయనను ప్రేమగా షారుఖ్‌ను హగ్ చేసుకోగా.. మరి కొంతమంది ఆయనతో ఫొటోలు దిగారు. అయితే.. ఓ మహిళా షారుఖ్ వద్దకు చేరుకుని ‘మిమ్మల్ని ముద్దుపెట్టుకోవచ్చా?’ అని అడిగింది.
సమాధానం చెప్పేలోపే ఆయన బుగ్గపై బలవంతంగా ముద్దుపెట్టింది. తన అభిమాన హీరోని ముద్దుపెట్టుకున్నానన్న ఆనందంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే, అభిమాని చేసిన పనితో షారుఖ్ కాస్త ఇబ్బందిగా కనిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Love for this man will never diminish because, this man has always brought smiles to his people's faces, given love, so he has received the love of the entire world.❤️#ShahRukhKhanpic.twitter.com/wMaLah2QDf
— 😎Sourav Srkian Das😎 (@SrkianDas04) June 14, 2023