రీల్ హీరోగా విరాట్ కొహ్లి..?

-

టీం ఇండియా రథసారధి విరాట్ కొహ్లి స్టేడియం లో దిగితే పరువుల సునామి అన్నట్టే. కొహ్లి వస్తున్నాడు అంటే ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరుగెట్టాల్సిందే. పెవిలియన్ లో తన ఆటతో సత్తా చాటే విరాట్ అప్పుడప్పుడు కెమెరా ముందు కూడా మెప్పిస్తున్నాడు. సూపర్ క్రేజ్ ఉన్న విరాట్ కొహ్లి ప్రస్తుతం వాణిజ్య ప్రకటనలు చేస్తున్నాడు.

అయితే అతను హీరోగా మారుతున్నాడని లేటెస్ట్ టాక్. ఈ విషయాన్ని అతనే ఎనౌన్స్ చేశారు. 10 ఏళ్ల తర్వాత మరో డెబ్యూ అంటూ ఓ పోస్టర్ వదిలాడు విరాట్ కొహ్లి. ట్రైలర్ టైటిల్ తో వస్తున్న మూవీ పోస్టర్ తో సర్ ప్రైజ్ ఇచ్చాడు విరాట్ కొహ్లి. విరాట్ కొహ్లి నిజంగానే సినిమాలు చేస్తున్నాడా లేక ఏదైనా వెబ్ సీరీస్ చేస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది.

విరాట్ సతీమణి అనుష్క శర్మ ప్రయోగాలు చేస్తూ బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించింది. మరో విరాట్ కూడా హీరోగా చేస్తే ఇద్దరు కలిసి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news