ప్రేక్షకుల చేతుల్లో నోటా రిలీజ్.. అదెలా..?

-

విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ రంగ డైరక్షన్ లో వస్తున్న సినిమా నోటా. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవనున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను అక్టోబర్ 4 అని నిర్ణయించారు. విజయ్ నోటా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాలేదని సినిమా ఔకున్న టైం కు వస్తున్నా రాదా అన్న డౌట్ వచ్చింది. అక్టోబర్ 4 లేదా 18 రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అన్నారు.

అయితే విజయ్ తన ట్విట్టర్ లో నోటా ఏ డేట్ కు రిలీజ్ చేయాలో మీరే చెప్పండి అంటూ ఓ వెరైటీ పోల్ పెట్టాడు. అక్టోబర్ 5, 10, 18, నోటా అంటూ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ సినిమా రిలీజ్ చేసేందుకు మంచి రోజులున్నాయి అలానే చెడు రోజులున్నాయి.. నోటా రిలీజ్ వెనుక డ్రామా నడుస్తుంది. అందుకే మీరు సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే బాగుంటుందో చెప్పడ్ని అంటూ ఆడియెన్స్ కే ఓ పోల్ పెట్టాడు విజయ్ దేవరకొండ. మరి ఆడియెన్స్ చెప్పినట్టుగానే విజయ్ నోటా వస్తుందా లేదా అన్నది చూడాలి. అంతేకాదు ఈ విధంగా సినిమా రిలీజ్ ను ప్రేక్షకుల నిర్ణయానికి వదిలేయడం అది కేవలం అర్జున్ రెడ్డి అదేనండి మన గోవిందానికి మాత్రమే చెల్లిందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news