Vishwak Sen: అమ్మాయిలా ‘విశ్వక్‌సేన్’.. ‘లైలా’ ఫస్ట్ లుక్ రిలీజ్

-

Vishwak Sen Laila Movie First Look: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే ఓరి దేవుడా సినిమాతో థియేటర్​లో సందడి చేసిన ఈ యంగ్ హీరో ఆ తర్వాత ముఖచిత్రం అనే సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీలో విశ్వక్ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఇక మొన్న గామీ పెద్దగా ఆడలేదు. గ్యాంగ్‌ ఆఫ్‌ గోదారి కూడా పెద్దగా సక్సెస్‌ కాలేదు. ఈ తరుణంలోనే… మరో సినిమాతో వస్తున్నాడు.

Vishwak Sen Laila Movie First Look

మాస్ క్యారెక్టర్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన హీరో విశ్వక్ సేన్ తొలిసారి అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నారు. రామ్ నారాయన్ దర్శకత్వంలో విశ్వక్ ‘లైలా’ సినిమాలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం నేడు జరగ్గా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అమ్మాయి గెటప్ లో విశ్వక్ బ్యూటిఫుల్ గా ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా 2025 Feb 14న రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news