‘ వార్‌ ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌… దుమ్మురేపిన హృతిక్‌.. టైగ‌ర్‌

-

హృతిక్ రోషన్ – టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో యాష్‌రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కి గాంధీ జ‌యంతి కానుక‌గా అక్టోబ‌ర్ 2న రిలీజ్ అయిన ఈ సినిమాకు సైరా పోటీ ఉన్నా స‌రే బాలీవుడ్‌లో దుమ్ము రేపింది. వార్ ఓవ‌రాల్‌గా హిందీలో రు.50 కోట్ల‌కు పైగా గ్రాస్ వసూళ్లతో అల్ టైం హ‌య్య‌స్ట్ గ్రాస్పింగ్ రికార్డు దిశ‌గా దూసుకుపోతోంది.

బాలీవుడ్‌లో ఇద్ద‌రు స్టార్ హీరోలు సీనియ‌ర్ అయిన హృతిక్ రోష‌న్‌, మ‌రో యంగ్ హీరో టైగ‌ర్ ష్రాప్ క‌లిసి న‌టించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌కు దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీ దేశవ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్ అందుకుంది. ఇండియ‌న్ ఏజెంట్స్ అయిన ఈ ఇద్ద‌రు హీరోల మ‌ధ్య న‌డిచే వార్ డ్రామాగా వార్ తెర‌కెక్కింది.

సినిమాలో యాక్ష‌న్ స‌న్నివేశాలు ఒళ్లు గ‌గుర్పొడిచేలా ఉన్నాయ‌ని సినిమా చూసిన ప్రేక్షకులు ప్ర‌శంసిస్తున్నారు. హృతిక్ ఇటీవ‌ల క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్‌కు దూరంగా ప్ర‌యోగాత్మ‌క సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ క్ర‌మంలోనే చాలా రోజుల త‌ర్వాత హృతిక్‌కు వార్ రూపంలో మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్ వ‌చ్చిన‌ట్ల‌య్యింది.

ఇక వార్ బాలీవుడ్‌లో తొలి రోజే ఇప్పటివరకు రు. 52 కోట్ల మొదటిరోజు గ్రాస్ కలెక్షన్స్ తో అమిర్ ఖాన్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రం ఉంది. వార్ మూవీ ఫైనల్ కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చేసరికి ఈ రికార్డు ని అధిగమించే అవకాశం ఉంది. యాష్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ మూవీలో హీరోయిన్ గా వాణి కపూర్ నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news