గూగుల్‌ మ్యాప్స్‌లో 57 వేల టాయిలెట్లు వివరాలు..

-

ప్ర‌స్తుత టెక్నాలిజీ ప్ర‌పంచంలో.. ఏది కావాల‌న్నా స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఎక్క‌డి క‌న్నా వెళ్తే.. ఎవరినీ రూట్ అడగాల్సిన పనేలేదు.. గమ్యస్థాన్ని గూగుల్ మ్యాప్‌లో టైప్ చేస్తే చాలు అదే రూట్ చూపిస్తోంది. అయితే ఇతర ప్రాంతాలకు వెళినప్పుడు అత్యవసరంగా మలమూత్ర విసర్జనకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఇక ఆందోళన చెందాల్సన అవసరం లేదు.. ఎందుకంటే ఇప్పుడు గూగుల్‌ మ్యాప్‌లో టాయిలెట్లను కూడా చూపిస్తోంది. మీ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌ ను తెరిచి, ‘టాయిలెట్‌ నియర్‌ మి’ అని టైప్‌ చేయండి. లేదా వాయిస్‌ టైపింగ్‌ ఆప్షన్‌ను వాడుకోండి.

ఇలా చేయగానే సమీపంలోని మరుగుదొడ్లు(సులభ్‌ కాంప్లెక్సులు) చిరునామాలు ప్రత్యక్షమవుతాయి. ప్రస్తుతం దేశంలోని 2,300 నగరాలు/పట్టణాల్లో ఉన్న 57వేల పబ్లిక్‌ టాయిలెట్ల సమాచారం తమ సెర్చ్‌ ఇం జన్‌లో నిక్షిప్తమై ఉందని గూగుల్‌ మ్యాప్స్‌ వెల్లడించింది. అలాగే ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్‌కు ఇది తోడ్పడుతుందని అభిప్రాయ పడింది.

Read more RELATED
Recommended to you

Latest news