ఆర్ఆర్ఆర్ విషయంలో వెనక్కు తగ్గని జక్కన్న…!

ఇప్పుడు కరోనా కారణంగా ఏ సినిమా కూడా షూటింగ్ చేసే పరిస్థితి దాదాపుగా కనపడటం లేదు. ఏ సినిమా అయినా సరే వాయిదా వేయడమే గాని షూటింగ్ కి వెళ్ళే అవకాశం లేదనే విషయం అర్ధమవుతుంది. దీనితో విడుదల చెయ్యాలి అనుకున్న తేదీలను మారుస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ నేపధ్యంలోనే ఇప్పుడు భారీ మల్టీ స్టారర్ గా వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాను వాయిదా వేస్తారని భావించారు.

ఆర్ఆర్ఆర్ సినిమాను వాయిదా వేసి వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే అనూహ్యంగా జక్కన్న తన నిర్ణయాన్ని మార్చుకుని… ఆయన జనవరి 8 నే విడుదల చెయ్యాలి అని భావిస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే… ఈ సినిమా షూటింగ్ 90 శాతం షూటింగ్ అయిపోయింది అని అంటున్నారు. ఇక ఎడిటింగ్ పనులు కూడా చేస్తున్నారు.

సినిమా వర్క్ చేసే వాళ్ళను ఎక్కడికి పంపడం లేదు. వాళ్ళు అందరూ కూడా ఒక ఇంట్లో ఉండి ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేస్తున్నారని వారి బాధ్యత మొత్తం కూడా జక్కన్నే చూస్తున్నారని అంటున్నారు. ఇక అంతకు ముందు కొన్ని సన్నివేశాలను షూట్ చేసి వద్దనుకున్నారు. ఇప్పుడు ఆ సన్నివేశాలను మళ్ళీ తీసుకోవాలని జక్కన్న భావిస్తున్నారట. అందుకే ధైర్యంగా ఉన్నారు అంటున్నారు.