ఎట్టేట్టా.. కాజల్ చేతుల్లో బిగ్ బాస్ విన్నర్స్..!

-

బిగ్ బాస్ సీజన్ 2 కౌశల్ విన్నర్ గా టైటిల్ అందుకున్న విషయం తెలిసిందే. ఎన్.టి.ఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ మొదటి సీజన్ లో శివ బాలాజి విన్నర్ గా నిలిచాడు. ఈ సీజన్ కౌశల్ కు ఆ అవార్డ్ దక్కింది. మొదటి సీజన్ కన్నా రెండవ సీజన్ కు ఎక్కువ ప్రేక్షకాదరణ దక్కిందని చెప్పొచ్చు.

అయితే బిగ్ బాస్ విన్నర్స్ శివ బాలాజి, కౌశల్ లలో ఇద్దరికి సంబందించిన ఓ పాయింట్ వారు బిగ్ బాస్ విన్నర్స్ అయ్యేందుకు సహకరించిందని అంటున్నారు. అదేంటి అంటే వారు కాజల్ కు బావలు గా చేయడం వల్లే అని అంటున్నారు. హీరోయిన్ కాజల్ కు బిగ్ బాస్ విన్నర్ కు సంబంధం ఏంటి అంటే కాజల్ తో చందమామ సినిమాలో నటించిన శివ బాలాజి అందులో ఆమెకు బావగా నటించాడు.

ఇక కౌశల్ కూడా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో కాజల్ కు బావగా చేశాడు. ఇద్దరికి కామన్ పాయింట్ కాజల్. సో బిగ్ బాస్ మొదటి సీజన్, రెండవ సీజన్ కాజల్ బావలు కావడం వల్లే టైటిల్ కొట్టారని అంటున్నారు. ఇది జస్ట్ రూమర్ గా అనిపిస్తున్నా కాజల్ లక్ వల్లే ఈ ఇద్దరికి బిగ్ బాస్ టైటిల్ వచ్చిందని చెప్పే వారు లేకపోలేదు. ఆట వారిది.. విజయం వారిది.. దీనికి కాజల్ కు ఏమాత్రం సంబంధం లేదన్నది కొందరి మాట.

Read more RELATED
Recommended to you

Latest news