నల్ల కలువ అమలాపాల్ ఇటీవల విజయ్ సేతుపతి సినిమా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆమె పారితోషికం ఎక్కువ అడిగిందన్న కారణంగా బయటకి వచ్చేసినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే అసలు కథ మరొకటి నడిచిందని అమపాల్ అవేదన వ్యక్తం చేసింది. తనని కావాలనే సినిమా నుంచి తప్పించి…ఆ తప్పును తన మీద వేస్తున్నారని ఆరోపించింది. దీనికి సంబంధించి ఓ లేఖ కూడా రిలీజ్ చేసింది. నేను నిర్మాణ సంస్థతో స్నేహపూర్వకంగా లేనని తొలగించారని ఆ లేఖలో పేర్కొంది. ఇప్పటివరకూ చాలా సినిమాల్లో నటించాను. ఏ సంస్థతోనే ఇలాంటి ఇబ్బందులు తలెత్తే లేదు. కానీ ఈ ఘటనను జీర్ణించుకోలేక పోతున్నా. భాస్కర ఒరు రాస్కల్ సినిమాకు రావాల్సిన డబ్బును సైతం వదులుకున్నా.
త్వరలో విడుదల కాబోతున్న `అదో అంద పారవాయ్ పోలే` అనే సినిమా కోసం ఓ గ్రామంలో వసతి కలిపించారు. సిటీ హోటల్ లో రూమ్ బెఉక్ చేస్తే ఎక్కువ ఖర్చు అవుతుందని ఆ చిత్ర నిర్మాతలు అలా చేసారు. అప్పుడు కూడా ఎవరిపైనా ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. ఆ సినిమాకు ఇవ్వాల్సిన కాల్షీట్లు కంటే ఎక్కువగానే ఇచ్చాను. విజయ్ సేతు పతి సరసన ఛాన్స్ రాగనే ఎంతో సంబర పడ్డా. కానీ ఆ సంతోషం ఎంతో సేపు ఉంచలేదు. సినిమాలంటే అంకిత భావంతో పనిచేసే దాన్ని . కానీ మీరు హద్దులు మీరారు. `ఆమె` సినిమాలో నగ్నంగా నటించానన్న కారణంగా తీసేసారని తెలుసుకోలేనంత అవివేకంలో లేను. ఇలాంటి ఆలోచన మానుకోవాలి. సినిమా రంగంలో ఉంటూ కళాకారులను అర్ధం చేసుకునే విధానం అదేనా? అంటూ ప్రశ్నించింది.
నాపై మీరు చేస్తోన్న ఆరోపణలకు సమాధానాలు చెప్పాలంటూ అమలాపాల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె పాటల్లో నీతి, నిజాయితీ కనిపిస్తోంది. ఆమె లేఖను బట్టి చూస్తుంటే నిర్మాతలదే తప్పంతా అని సోషల్ మీడియాలో అంతా ఆమెకు మద్దతునిస్తున్నారు. ఏదేమైనా ఎ.ఎల్ విజయ్ తో విడాకుల తర్వాత అమల కెరీర్ ఒడిదుడుకులకు లోనవుతున్నట్లు అనిపిస్తోంది. సినిమా అవకాశాలు తగ్గడమే కాకుండా, ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వాళ్లు పెరుగుతున్నారు. ఆ మధ్య ఓ సినిమా విషయంలోనూ ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కుంది. మును ముందు ఇంకెలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో.