బిగ్‌బాస్ 3 నుంచి గాయ‌త్రి గుప్తా ఔట్‌..?

-

బిగ్‌బాస్ 3 లో గాయ‌త్రి గుప్తా ఉంటుంద‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగినా.. చివ‌రి నిమిషంలో ఆ లిస్ట్ నుంచి ఆమె పేరును స్టార్ మా తొల‌గించింద‌ట‌.

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 2 అంత ఆస‌క్తిక‌రంగా ఏమీ సాగ‌లేదనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. కౌశ‌ల్ ఆర్మీ పుణ్య‌మా అని వారం వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రు, ఫైనల్ విన్న‌ర్ ఎవ‌రు.. త‌దిత‌ర విషయాల‌న్నీ ప్రేక్ష‌కుల‌కు ముందే తెలిశాయి. దీంతో ఆ షోపై ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. అలాగే హోస్ట్‌గా నాని ఆ షోకు సెట్ కాక‌పోవ‌డంతో బిగ్‌బాస్ 2కు అంత‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. దీంతో బిగ్‌బాస్ 3కి మ‌రోసారి ఎన్‌టీఆర్‌ను హోస్ట్‌గా తీసుకువ‌స్తార‌ని జోరుగా ప్ర‌చారం సాగింది. అయితే అంద‌రి అంచ‌నాలను త‌ల‌కిందులు చేస్తూ.. ఆశ్చ‌ర్య‌కరంగా ఈ సారి నాగార్జున ఆ షోకు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. దీంతో ఈ వార్త కాస్తా గ‌త కొద్ది రోజుల కింద‌ట‌ సంచ‌ల‌న‌మే అయింది.

అయితే బిగ్‌బాస్ 3కి సంబంధించి నిర్వాహ‌కులు ఈ సారి చాలా ప‌క‌డ్బందీగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆ షోకు చెందిన వివ‌రాలేవీ బ‌య‌ట‌కు తెలియ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. కానీ లీకుల ద్వారా ప్రేక్ష‌కుల‌కు అన్నీ సంచ‌ల‌న విష‌యాలే తెలుస్తున్నాయి. కాగా ఈ సారి షోలో పాల్గొనే కంటెస్టెట్ల విష‌యంలోనూ స్టార్ మా చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. అందులో భాగంగానే ప‌లువురు కంటెస్టెట్ల‌ను స్టార్ మా ఇప్ప‌టికే ఫైన‌ల్ చేసింద‌ని తెలుస్తుండగా.. ఈ సారి షోలో పాల్గొనేవారు వీరేనంటూ.. కొన్ని లిస్ట్‌లు నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే అన్ని లిస్ట్‌లలోనూ న‌టి గాయ‌త్రి గుప్తా పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. దీంతో ఆమె ఈసారి షోలో పాల్గొన‌డం ఖాయ‌మ‌ని ఇప్ప‌టి వ‌రకు తెలిసింది.

అయితే అనూహ్యంగా ఇప్పుడు మ‌రోవార్త నెట్‌లో సంచ‌ల‌నం అవుతోంది. బిగ్‌బాస్ 3 లో గాయ‌త్రి గుప్తా ఉంటుంద‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగినా.. చివ‌రి నిమిషంలో ఆ లిస్ట్ నుంచి ఆమె పేరును స్టార్ మా తొల‌గించింద‌ట‌. గ‌తంలో ఆమెతో ఆ టీవీ ప్ర‌తినిధులు చ‌ర్చ‌లు జ‌రిపార‌ని, అన్నీ ఫైన‌ల్ అయ్యాయ‌ని, కానీ ఇప్పుడు సడెన్‌గా ఆమె పేరు బిగ్‌బాస్ 3 కంటెస్టెట్ల జాబితా నుంచి మాయ‌మైంద‌ట‌. ఆమె పేరును జాబితా నుంచి తొల‌గిస్తున్నామ‌ని ఆమెకు స్టార్ మా చెప్పింద‌ట‌. దీంతో ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే మ‌రి ఇది నిజ‌మా, కాదా అన్న వివ‌రాలు మాత్రం ఇంకా తెలియ‌లేదు. కానీ దీనిపై అటు స్టార్ మా గానీ, ఇటు గాయ‌త్రి గుప్తా గానీ స్పందించ‌లేదు. మ‌రి ఇది నిజ‌మా కాదా అనేది తెలియాలంటే.. వ‌చ్చే వారం జ‌ర‌గ‌నున్న బిగ్‌బాస్ 3 ప్రెస్‌మీట్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఇక అదే రోజు ఆ షోకు చెందిన ప్రోమోను కూడా విడుద‌ల చేయ‌నుండ‌డంతో గాయ‌త్రి గుప్తా తొల‌గింపు విష‌యం.. నిజ‌మా, కాదా అనేది తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news