విఘ్నేష్ తో న‌య‌న‌తార పెళ్లి డౌటే..?

-

న‌య‌న‌తార ప్రేమాయ‌ణాల గురించి తెలిసిందే. కెరీర్ ఆరంభంలో శింబుతో పీక‌ల్లోతు ప్రేమాయ‌ణం సాగించింది. పెళ్లి చేసుకోవాల‌నుకుంది. కానీ కాలం మ‌రో మార్గం చూపించింది. అటుపై ప్ర‌భుదేవాతో స‌హ‌జీవ‌నం చేసింది. పెళ్లి వ‌ర‌కూ వెళ్లింది. కానీ ప్ర‌భుదేశా భార్య ఒప్పుకోక‌పోవ‌డంతో అక్కడా పుల్ స్టాప్ త‌ప్ప‌లేదు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ ప్రేమ‌లో ఉంది. పెళ్లి కూడా చేసుకుంటున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. అయితే ఈ మొత్తం మూడు ల‌వ్ స్టోరీల‌ను ఉద్దేశించి..న‌య‌న‌తార వ్య‌క్తిత్వం గురించి సీనియ‌ర్ పాత్రికేయుడు ఇమంది రామారావు ఓ ఇంట‌ర్వూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. ఇటీవ‌ల ఆయ‌న విజ‌య నిర్మ‌ల -సూప‌ర్ స్టార్ కృష్ణ‌ బంధం గురించి వెల్ల‌డించి టాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా న‌య‌న‌తార గురించి మాట్లాడి మ‌రోసారి సంచ‌ల‌నం సృష్టించారు. న‌య‌న్ తండ్రి ఎయిర్ ఫోర్స్ ఆఫీస‌ర్ అట‌. చిన్న‌త‌నం నుంచి రెబ‌ల్ గా ఉండేదిట‌. త‌ల్లిదండ్రుల అతి గారం కార‌ణంగా చెప్పిన మాట వినేది కాద‌ట‌. అంతా త‌న ఇష్ట ప్ర‌కార‌మే జ‌ర‌గాలని మొండి ప‌ట్టుద‌ల ప‌ట్టే టైప్ అట‌. క్రిస్టియ‌న్ అయిన‌ప్ప‌టికీ హేతువాది. శ్రీరామ రాజ్యం త‌ర్వాత సినిమాల‌కు మానేయ‌ల‌నుకుంద‌ట‌. అందుకు కార‌ణం ప్ర‌భుదేవాతో ల‌వ్ స్టోరీ కార‌ణ‌మ‌ట‌. పెళ్లి ప్ర‌పోజ‌ల్ తీసుకురాగానే ప్ర‌భుతేవా కొన్ని కండీష‌న్లు పెట్టాడు. అందుకు ఆమె ఒప్పుకుందిట‌. ప్ర‌భుదేవాకి తన‌ ఆస్త‌లు కూడా ఇచ్చిందిట‌. త‌ర్వాత వాటిని తిరిగి ఇచ్చాడో లేదో తెలియ‌దు గానీ…ఆ పెళ్లికి ప్ర‌భుతేవా భార్య ఒప్పుకోలేదు.

రెండ‌వ పెళ్లి చేసుకుంటే చ‌నిపోయే వ‌ర‌కూ నిర‌హార దీక్ష చేస్తాన‌ని మొండికేసిందిట‌. ఈ విష‌యం చెన్నైలో అంద‌రికీ తెలిసిపోవ‌డంతో అప్ప‌ట్లో పెద్ద గొడ‌వ‌లే జ‌రిగాయ‌ట‌. ఇక శింబు ప్లేబాయ్ అని… పెళ్లి అంటే అంటే ముఖం చాటేసే టైప్ అని తెలిపాడు. నిజానికి శిబునే ముందుగా పెళ్లి చేసుకోవాలనుకుంద‌ట‌. కానీ శింబు అందుకు ఒప్పుకోలేద‌ట‌. సెక్స్ అనేది ఇష్ట‌ప‌డి క‌లిసేదే త‌ప్ప‌! అది బాండింగ్ మాత్రం కాద‌ని బ‌లంగా న‌మ్మేమ‌న‌స్త‌త్వం క‌ల‌ద‌ట‌. మ‌న‌సు కోరుకుంటే పెళ్లి చేసుకుంటుది గానీ ..శ‌రీరం కోరుకుంటే జ‌రిగేది కాద‌నే మాట‌ను న‌మ్ముతుందిట‌. ఈ నేప‌థ్యంలో విఘ్నేష్ శివ‌న్ తో పెళ్లి జ‌రుగుతుందా? అన్న దానికి సందేహం వ్య‌క్తం చేసారు. జీవితంలో ఎన్ని ఇన్ని ఎదురు దెబ్బలు తిన్నా బ‌లంగా సంక‌ల్పించి పైకి లేచిందంటే కార‌ణం ఆమెలో ఉన్న ఎబిలీటినే. మ‌రొక‌రైతే చాప కింద నీరులా కారిపోయేవార‌న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news