బ‌న్నీ, కొర‌టాల మూవీ అప్పుడే ఉంటుందా?

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ సినిమా ప్రాజెక్టుల‌ను సెట్ చేసి పెడుతున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అర్జున్ చేస్తున్న ‘పుష్ప’ స్పీడ్‌గా షూటింగ్‌ జరుగుతోంది. సినిమా మీద భారీగా అంచనాలున్నాయి. ఇప్ప‌టికే రిలీజైన టీజ‌ర్ అంచ‌నాల‌ను అమాంతం పెంచేసింది. రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. ఏకంగా బాహుబ‌లి కంటే ఎక్కువ లైక్స్‌ వ‌చ్చిన టీజ‌ర్ గా చ‌రిత్ర సృష్టించింది. ‌విడుద‌లైన ఐదురోజుల్లోనే నాలుగున్న‌కోట్ల‌కు పైగా వ్యూస్ ని సొంతం చే‌సుకుంది. ఇందులో బ‌న్నీ ఊర మాస్ లుక్ విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. ఎర్ర‌చంద‌నం బ్యాక్‌డ్రాప్ లో సాగే ఈ సినిమాలో అర్జున్ ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ గా క‌నిపించ‌నున్నాడు.

బన్నీ ఫస్ట్ టైమ్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది. దీని త‌ర్వాత సినిమాలను కూడా అదే స్థాయిలో చేయాలనేది అర్జున్‌ ప్లాన్. ‘పుష్ప’ పూర్తికాగానే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. దీన్ని దిల్ రాజు నిర్మించనున్నారు.
ఇది కంప్లీట్ కాగానే కొరటాల శివతో మ‌రో సినిమా ఉంటుంది. చాలా రోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. కొరటాల శివ చిరంజీవితో చేస్తున్న‌‘ఆచార్య’ తర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమా పూర్తి కావడానికి చాలా టైమ్ పట్టేలా ఉంది. దీంతో ఈ లోపు బన్నీ ‘ఐకాన్’ మూవీ పూర్తి చేసుకుని ఇద్దరూ 2022 ప్రారంభానికి ఫ్రీ అవుతారు. కాబ‌ట్టి వీరి సినిమా 2022 ఏప్రిల్ నెల‌లో మొదల‌య్యే ఛాన్స్ ఉంది. దీన్ని కూడా పాన్ ఇండియా లెవల్లోనే తెరకెక్కిస్తార‌ని తెలుస్తోంది. 

Read more RELATED
Recommended to you

Latest news