ఉమెన్స్ డే స్పెషల్ : రీ రిలీజ్ కు సిద్ధమైన సమంత మూవీ..!

-

ప్రస్తుత కాలంలో సూపర్ హిట్ సినిమాలు.. స్టార్ హీరోల ఒకప్పటి సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ అవుతున్నాయి.. మహేష్ బాబుని మొదలుకొని ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, చిరంజీవి ,రజనీకాంత్, ధనుష్, సిద్ధార్థ్ ఇలా తెలుగు, తమిళ్లో దాదాపు చాలామంది స్టార్ హీరోల సినిమాలను స్పెషల్ రోజుల్లో రీ రిలీజ్ చేసి మరోసారి థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత కూడా తన సినిమాలు చేయడానికి సిద్ధమయ్యింది. సమంత లీడ్ రోల్ పోషిస్తూ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఓ బేబీ సినిమా ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నారు . ఈ సినిమాలో సమంత తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో యువతను ఆకట్టుకుంది.

2019లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ కొట్టి కలెక్షన్లు కూడా భారీగానే రప్పించింది. ఈ సినిమా చివర్లో నాగచైతన్య కూడా స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. మార్చి 8 అనగా రేపు ఉమెన్స్ డే సందర్భంగా ఈ సినిమాను థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు అయితే కేవలం PVR , Inox థియేటర్లలో మాత్రమే ఈ సినిమా రిలీస్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో PVR , Inox మల్టీప్లెక్స్ లలో ఓ బేబీ స్పెషల్ షోలు వేయనున్నారు. దీంతో సమంత ఫ్యాన్స్ ఈ సినిమా రీ రిలీజ్ కి వెళ్లి మరొకసారి సక్సెస్ చేయడానికి రెడీగా ఉన్నారు.

ప్రస్తుతం సమంత బాలీవుడ్ లో సిటాడెల్ సిరీస్ షూటింగ్లో బిజీగా ఉంది. ఈ సినిమా తర్వాత ఆమె విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమా షూటింగ్లో పాల్గొనబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news