Women’sday.. ఒకప్పుడు సూపర్ హిట్ గా నిలిచి భారీ విజయాన్ని అందుకున్న సినిమాలను ఇప్పుడు మళ్లీ విడుదల చేసే ట్రెండ్ ఇటీవల బాగా జోరు అందుకుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలను స్పెషల్ అకేషన్స్లో భాగంగా విడుదల చేస్తూ వస్తున్నారు. మేకర్స్ అభిమానుల నుంచి కూడా ఈ సినిమాలకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుంది. ఇక అభిమానుల నుంచి కూడా సినిమాలకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుండడంతో మేకర్స్ కూడా సినిమాలను మళ్లీ మళ్లీ విడుదల చేయడంపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఇది కేవలం స్టార్ హీరోలకు మాత్రమే పరిమితమైంది.
కానీ తొలిసారి ఒక హీరోయిన్ నటించిన చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్.. ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ సమంత. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ఓ బేబీ.. ఈ సినిమా 2019లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఉమెన్ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమాను సమంత తన నట విశ్వరూపాన్ని చూపించింది. సమంతతో పాటు లక్ష్మీ గారు కూడా అంతే అద్భుతంగా నటించారు. విమర్శల ప్రశంసలతో పాటు కలెక్షన్లను కూడా రాబట్టింది ఈ సినిమా. ఇదిలా ఉండగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మూవీని తిరిగి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు..
ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.. ” స్త్రీల నిజమైన అందం, శక్తిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ బేబీని స్క్రీన్ లపై చూడడం కంటే మెరుగైన మార్గం మరొకటి లేదు.. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పీవీఆర్ , ఐనాక్స్ స్క్రీన్ లలో సినిమా ప్రదర్శించబడుతుంది అని చిత్ర బృందం తెలిపింది. ఏది ఏమైనా ఇప్పుడు స్టార్ హీరోలతో తానేమి తక్కువ కాదంటూ నిరూపించుకోవడానికి సిద్ధమైంది సమంత. మరి రిలీజ్ లో ఈ సినిమా ఏ మేరా కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.
View this post on Instagram