బాక్సాఫీసును షేక్ చేస్తున్న రాఖీభాయ్..KGF2 సక్సెస్‌పై యశ్ స్పందన ఇదే..

-

ఈ నెల 14న విడుదలైన KGF2 ఎవరూ ఊహించని స్థాయిలో సక్సెస్ అయింది. ఈ చిత్రం రికార్డుల వేట ఇంకా కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్న ఈ సినిమా సక్సెస్ పట్ల తాజాగా రాఖీభాయ్ అలియాస్ రాకింగ్ స్టార్ యశ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. సదరు వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

ఆ వీడియోలో యశ్ ఇంట్రెస్టింగ్ స్టోరి చెప్పాడు. ‘‘ఓ గ్రామానికి ఒకానొక టైంలో తీవ్ర కరవు వచ్చింది. అప్పుడు ఆ గ్రామస్తులంతా దేవుడిని ప్రార్థించేందుకు ఓ చోటుకు చేరారు. అందులో ఒక అబ్బాయి మాత్రం అక్కడికి ఓ గొడుగుతో వెళ్లాడు. దాంతో అక్కడున్న వారంతా ఆ అబ్బాయి చేసిన పనికి నవ్వుకున్నారు. అందులో కొందరు అతనిది మూర్ఖత్వమని, మరికొందరు అతివిశ్వాసమని అనుకున్నారు. కానీ, అది సదరు అబ్బాయి నమ్మకం, విశ్వాసం మాత్రమే’’ అని పేర్కొన్నారు.

అలా అప్పుడు సదరు అబ్బాయి మాదిరిగా తాను కూడా నమ్మకంతో KGF సినిమా చేసినట్లు వివరించాడు యశ్. తన నమ్మకాన్ని నిలబెట్టిన మీ అందరికీ తన తరఫున, మూవీ యూనిట్ తరఫున థాంక్స్ చెప్పాడు. అయితే, థాంక్స్ అనే పదం చెప్తే సరిపోదని, కానీ, చెప్పక తప్పట్లేదన్నాడు. KGF2 ను అందరూ ఎంజాయ్ చేస్తు్న్నారని, ఇంకా చేస్తారని ఆశిస్తు్న్నానని చెప్పిన యశ్..చివరకు అభిమానులకు ‘యువర్ హార్ట్ ఈజ్ మై టెరిటరీ’ అనే డైలాగ్ చెప్పాడు.

యశ్ వీడియో పట్ల నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు. యశ్..యువతకు ఇన్ స్పిరేషన్ అని, గ్రేట్ హీరో అని కామెంట్స్ చేస్తు్న్నారు కొందరు నెటిజన్లు. యశ్..నెక్స్ట్ ఫిల్మ్ పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ ఫిల్మ్ ‘సలార్’ పైన ఫోకస్ చేస్తున్న క్రమంలో .. యశ్ ..తన తర్వాత చిత్రం ఎవరితో చేస్తారనేది వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version