వైఎస్ జగన్ రిలీజ్ చేసిన ‘ఇదం జగత్’ టీజర్

అక్కినేని హీరో సుమంత్ దశాబ్ధం పైగా సినిమాలు చేస్తున్నా ఒకటి రెండు హిట్లు తప్ప ఏమంత సాటిస్ఫైడ్ కెరియర్ కొనసాగించలేదు. కొన్నాళ్లుగా సుమంత్ సినిమాలు వస్తున్నా ఎప్పుడొస్తున్నాయో ఎప్పుడు వెళ్తున్నాయో అన్నట్టుగా ఉండేది. లాస్ట్ ఇయర్ వచ్చిన మళ్లీరావా సినిమాతో మళ్లీ తన సత్తా చాటాడు సుమంత్.

ఆ సినిమా ఇచ్చిన ప్రోత్సాహం తో ఇదం జగత్ అంటూ రాబోతున్నాడు ఈ అక్కినేని హీరో. కొద్ది గంటల క్రితం ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఇదం జగత్ టైటిల్ లానే టీజర్ కూడా మంచి సస్పెన్ మెయింటైన్ చేశారు. సుమంత్ ఈ సినిమాలో జర్నలిస్ట్ గా కనిపిస్తున్నాడు. చావు న్యూసే.. జ్ఞాపకాలు న్యూసే.. ప్రేమ న్యూసే.. స్నేహం న్యూసే.. ఇలా ప్రతి ఒక్కటి న్యూస్ గా మార్చే తెలివితేటలు తనకు ఉన్నాయంటూ హీరో చెప్పడం చూస్తుంటే సినిమా ఇప్పుడున్న జెనరేషన్ మీద ఓ పంచ్ లా అనిపిస్తుంది.

టీజర్ లో సుమంత్ మళ్లీ ఈ సినిమా కూడా హిట్ కొట్టబోతున్నాం అన్న కాన్ ఫిడెంట్ కనిపిస్తుంది. అనీల్ శ్రీకాంతం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు శ్రీ చరణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ టీజర్ రిలీజ్ చేయడం విశేషం.