ఐదో కాన్పులోనూ కవలలు.. ఇల్లొదిలి పరారైన భర్త

-

పిల్లలంటే ఇష్టపడని వారుండరు. తాము తల్లిదండ్రులం కాబోతున్నామని తెలిశాక ఆ దంపతుల ఆనందం అంతా ఇంతా కాదు. ఇక కవలలు పుడితే ఆ సంతోషం డబుల్ అవుతుంది. కానీ ఐదు సార్లు కవలలే పుడితే..? 10 మంది పిల్లలను పోషించాల్సిన బాధ్యత నెత్తిమీద పడితే..? ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి..? ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఉగాండాలోని ఓ జంటకు.
నలోంగో గ్లోరియా నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ. ఉపాధి కోసం రాజధాని కంపాలాకు వచ్చింది. అక్కడే కొన్నేళ్ల క్రితం స్సలోంగో పరిచయం అయ్యాడు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. గ్లోరియా గర్భం దాల్చింది. కవలలకు జన్మనిచ్చింది. అలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు సార్లు కవలల్ని ప్రసవించింది గ్లోరియా.
గ్లోరియా సహజసిద్ధంగానే ఆమె ఐదు సార్లు కవలల్నే ప్రసవించింది. అయితే.. ఆమె భర్త స్సలోంగోకు మాత్రం ఇది నచ్చలేదు. 9వ, 10వ బిడ్డలు పుట్టగానే.. గ్లోరియాకు తన మనసులో మాట తెగేసి చెప్పేశాడు అతడు. పుట్టింటికి వెళ్లిపోమని అన్నాడు. అయితే.. అందరినీ విడిచి వచ్చేసిన గ్లోరియాకు ఏం చేయాలో పాలుపోలేదు. భవిష్యత్ సవాళ్లను ఊహించుకుంటూ ఇంట్లో అలానే మౌనంగా ఉండిపోయింది.
ఓ రోజు పనికి వెళ్లి తిరిగి వచ్చే సరికి స్సలోంగో ఇంటి దగ్గర లేడు. లగేజీ సర్దుకుని ఎక్కడికో వెళ్లిపోయాడని ఆలస్యంగా అర్థమైంది. భర్త ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియదు. అప్పటి నుంచి అతడి దగ్గరి నుంచి ఒక్క ఫోన్​ కాల్ అయినా రాలేదు. సంతానంలో మొదటి ఇద్దరు పెద్దవారై, ఇటీవలే తమ దారి తాము చూసుకుని వెళ్లిపోయారు. మరొకరు మరణించారు. మిగిలిన ఏడుగురి బాధ్యత ఇప్పుడు గ్లోరియాపైనే పడింది.
“ఇంత మంది పిల్లలకు జన్మనిచ్చినందుకు నాకు బాధ లేదు. తండ్రికి వీరంటే ఇష్టం లేదని నాకు తెలుసు. కానీ వీరిని వదిలేయలేను. ఎన్ని సవాళ్లు ఎదురైనా.. నా బిడ్డల్ని విడిచి పెట్టను. దేవుడే అన్నీ చుసుకుంటాడని నమ్ముతున్నా” అని చెప్పింది నలోంగో గ్లోరియా.

Read more RELATED
Recommended to you

Latest news