ఈ గుడిలో హనుమంతుడిని బేడీలతో కట్టేశారు..!

-

అవును.. మీరు చదివింది కరెక్టే. ఆ గుడిలో హనుమంతుడిని బేడీలతో కట్టేశారు. ఇంకెప్పుడూ ఆ బేడీలను తీయరు. అలాగే ఉంటాయి. ఇంతకీ అది ఏ గుడి. ఎందుకు హనుమంతుడిని కట్టేశారు. దాని స్థల పురాణమేంటి? తెలుసుకుందాం పదండి..

అది పూరీ జగన్నాథ్ ఆలయం. పూరీ జగన్నాథ్ ఆలయం అంటేనే ఎన్నో విశేషాలు. ఎన్నో ప్రత్యేకతలు. ఆ ఆలయంలోనే హనుమంతుడి గుడి ఉంటుంది. అక్కడే హనుమంతుడిని బేడీలతో కట్టేశారు. ఆ దేవాలయాన్నే దరియా మహవీర దేవాలయం అని కూడా పిలుస్తారు.

దరియా అంటే సముద్రం అని అర్థం. అక్కడి ప్రజలు సముద్రం నుంచి తమ నగరాన్ని కాపాడే దేవుడిగా హనుమంతుడిని కొలుస్తారు. మరి.. తమను కాపాడే దేవుడిగా కొలుస్తున్నప్పుడు హనుమంతుడిని బేడీలతో కట్టేయడం ఎందుకు అనే అనుమానం మీకు వచ్చే ఉంటుంది.

పూరీ జగన్నాథ్‌లో జగన్నాథుడు వెలిసాక.. ఓరోజు ఆయన దర్శనం కోసం సముద్రదేవుడు వచ్చాడు. ఆ సమయంలో సముద్రంలోని నీరు అంతా అక్కడికి రావడంతో చాలా హాని జరిగింది. ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా సంభవించడంతో ప్రజలంతా తమను కాపాడాలంటూ జగన్నాథుడిని వేడుకుంటారు. వెంటనే జగన్నాథుడు రక్షకుడైన హనుమంతుడిని పిలుస్తాడు. ఆ సమయంలో హనుమంతుడు అక్కడ ఉండడు. అయోధ్య వెళ్తాడు.

తన అనుమతి లేకుండా హనుమంతుడు అయోధ్య వెళ్లాడని తెలుసుకున్న జగన్నాథుడు.. ఆంజనేయస్వామి కాళ్లు చేతులను పగ్గంతో కట్టేస్తాడు. పూరీ క్షేత్రాన్ని రాత్రింబవళ్లు కాపాడాల్సిన బాధ్యత హనుమంతుడిదేనని.. ఇంకెప్పుడు ఎక్కడికీ వెళ్లకుండా.. ఇక్కడే ఉండి ప్రజలను రక్షించాలంటూ బేడీలతో కట్టేస్తాడు. దీంతో అప్పటి నుంచి హనుమంతుడు అక్కడ బేడీలతో కట్టేసి ఉంటాడు. హనుమంతుడిని బేడీలతో కట్టేసినప్పటి నుంచి అక్కడ ఎటువంటి ఉపద్రవం సంభవించలేదట. సముద్రంలోని నీరు కూడా అక్కడికి ఇంత వరకూ రాలేదట. అంటే.. బేడీలతో ఉన్న హనుమంతుడే తమను రక్షిస్తున్నాడని.. పూరీ ప్రజలు కూడా అలాగే బేడీలతోనే హనుమంతుడిని ఇప్పటికీ పూజిస్తున్నారు. అలా.. అక్కడ హనుమంతుడు బేడీల హ‌నుమాన్ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news