ఈ అలవాట్లు కనుక ఉంటే మానుకోండి.. లేదంటే అంతే సంగతులు…!

ఆచార్య చాణక్యుడు బహుముఖ ప్రజ్ఞాశాలి. అయిన చాణక్య నీతి ద్వారా ఎన్నో గొప్ప విషయాలను తెలిపారు. వీటిని కనుక మనం అనుసరించాము అంటే కచ్చితంగా ఉన్నతమైన స్థితిలో ఉంటాము. ఆయన అనుభవాలు ఆధారంగా మనిషి జీవించే విధానం గురించి ఎన్నో గొప్ప విషయాలను తెలిపారు.

Goddess Lakshmi Devi | శ్రావ‌ణ మాసం
Goddess Lakshmi Devi | శ్రావ‌ణ మాసం

వీటిని కనుక మనం అలవాటు చేసుకుంటే ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవచ్చు. అలానే గౌరవం, కీర్తి ప్రతిష్ఠలు పొందొచ్చు. అయితే మరి చాణక్యుడు చాణక్య నీతి ద్వారా చెప్పిన విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. మనిషిలో కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి.

ఈ చెడు అలవాట్ల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంద లేరు. అయితే మరి ఆ చెడు అలవాట్లు ఏమిటో సరి చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఒక వ్యక్తికి ఈ చెడు అలవాట్లు కనుక ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం అస్సలు పొందలేడు. పేదరికమే ఉంటుంది.

గొడవ పడడం:

ప్రతి రోజు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండే వాతావరణం కనుక మీ ఇంట్లో ఉంటే అప్పుడు లక్ష్మీదేవి అసంతృప్తిగా ఉంటుంది. దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. కాబట్టి స్నేహపూర్వక వాతావరణం ఉండేటట్లు చూసుకోండి.

అపరిశుభ్రత:

ఇల్లుని మురికిగా ఉంచడం, ఒంటిని మురికిగా ఉంచుకోవడం లాంటివి చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు. ధన నష్టం కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అలవాటు ఉన్న వాళ్ళు మానుకోండి.

అమర్యాదగా ఉండడం:

పెద్దల పట్ల మర్యాద లేకుండా ఉంటే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు. కనుక ఈ చెడు అలవాట్లు మీకు ఉంటే వీటిని మానుకోవడం మంచిది.