అంజనేయుడికి హనుమాన్ పేరు ఎలా వచ్చిందంటే…!

భవిష్యత్ బ్రహ్మ హనుమాన్!

నమస్తే సదాబ్రహ్మచారీ! నమస్తే ప్రపూర్ణార్తి హారీ!!
నమో వాయుపుత్రా! నమస్తే నమస్తేనమః!!

అపర పరాక్రమంతుడు, మహా బుద్ధిశాలి, చతుర్వేదపండితుడు, సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు హనుమంతుడు. అంజనీపుత్రుడు లేని రామాయణం ఊహించనలవికాదు. చైత్ర శుద్ధ పౌర్ణమి హనుమత్ జయంతిగా ఉత్తరభారత దేశ ఆచారం ప్రకారం నిర్వహించుకుంటాం. ఈ సందర్భంగా హనుమద్ లీలలు తెలుసుకుందాం….

బాల అంజనేయుడికి హనుమాన్ పేరు ఎలా వచ్చిందంటే...!
బాల అంజనేయుడికి హనుమాన్ పేరు ఎలా వచ్చిందంటే…!

బాల అంజనేయుడికి హనుమాన్ పేరు ఎలా వచ్చిందంటే…!

అంజనీదేవికి పుట్టిన వెంటనే ఆకలికి తాళలేక ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూసి పండుగా భావించి ఆకాశానికి ఎగిరి సూర్యున్ని పట్టుకుని మింగబోయాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన రాహువు ఆంజనేయున్ని బెదరించాడు. దాంతో ఆ వానర బాలుడు రాహువునే మింగబోయాడు. దీంతో రాహువు భయపడి ఇంద్రునితో చెప్పుకున్నాడు. ఇంద్రుడు ఐరావతం ఎక్కి వచ్చాడు. బాల ఆంజనేయుడు ఐరావతం మీదకు ఉరికాడు. అప్పుడు ఇంద్రుడు ఆ బాలున్ని వజ్రాయుధంతో కొట్టాడు, హనువులు కొట్టబడటంతో ఆంజనేయునికి హనుమంతుడు అనే పేరు వచ్చింది. తన పుత్రుని పాటు చూసి వాయువుకు ఇంద్రుని మీద కోపం వచ్చింది. కోపంతో లోకసంచారం మానుకున్నాడు వాయువు. వాయు సంచారం లేక లోకం అంతా తల్లడిల్లింది. అప్పుడు బ్రహ్మా ఇతర దేవతలతో కూడి వచ్చి వాయుదేవుడిని స్తుతించి ఆంజనేయుడికి చిరంజీవిత్వంతోపాటు అనేక వరాలు ప్రసా