గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న కాంగ్రెస్‌నేత హార్దిక్ పటేల్‌కు చేదు అనుభవం ఎదుదైంది. సురేందర్‌నగర్ జిల్లాలో ప్రచార సభలో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆయన చెంప చెళ్లుమనిపించాడు. సురేందర్‌నగర్‌లోని బల్దానాలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన జన ఆకర్ష్ ర్యాలీలో పాల్గొన్న హార్దిక్ ప్రసంగిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి పార్టీ మారతావా అంటూ చెంపపై కొట్టాడు. 14 మందికి మృతికి కారణమయ్యావ్ అంటూ వాగ్వాదానికి దిగాడు. అంతలోనే అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు తేరుకుని ఆ వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు.
పార్టీ మారడం వల్లే తను కొట్టినట్టు ఆ గుర్తు తెలియని వ్యక్తి తెలిపాడు. పటేల్ గతంలో చేపట్టి ఆందోళనలో 14 మంది చనిపోయారిన, వారి మృతికి పటేల్ బాధ్యత వహించాలంటూ పోలీసులతో చెప్పినట్టు తెలుస్తుంది. అయితే పాటీదార్ ఉద్యమనేత అయిన హర్దిక్ పటేల్ ఈ మద్యనే కాంగ్రెస్ పార్టీలో చేరారు..
ఇంకా తనకు జరిగిన ఈ చేదు అనుభవం నుండి తేరుకున్న హార్దిక్ పటేల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తరువాత మాట్లాడుతూ.. ఇదంతా బీజేపీ కుట్ర అని, తనను చంపడానికి బీజేపీ కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ఎవ్వరు ఏమి చేసినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి తెలిపారు.
Here is thr video pf @HardikPatel_ slapped in #Surendranagar Team Hardik claims that the slap was pre planned and this Tarun Gajjar was paid money by a senior BJP office bearer from #Gujarat pic.twitter.com/KJR14o1Tlx
— Deepal.Trivedi (@DeepalTrevedie) April 19, 2019