ఆంజనేయ స్వామి గుడికి వెళితే ఎన్ని ప్రదక్షణలు చెయ్యాలో తెలుసా?

ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారు.. అయితే చాలామంది హనుమంతుడి దేవాలయంలో ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలన్న సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు.. అయితే 108 ప్రదక్షణలు చేస్తే ఇంకా మంచిదని, ఎటువంటి దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు..ఒక్కో ప్రదక్షిణను పువ్వులు లేదా ఒక్కల తో లెక్కించాలి..

ఒకవేళ 108 ప్రదక్షిణాలు చేసేందుకు మీ శరీరం సహకరించని పక్షంలో కనీసం 54 ప్రదక్షిణాలైన చేయాలి. అందుకు కూడా వీలుకాకపోతే అందులో సగం అంటే 27 ప్రదక్షిణలు చేసిన సరిపోతుంది. చివరికి అది కూడా వీలు కాకపోతే 11 ప్రదక్షిణలు చేస్తే చాలు. ఇవి కూడా వీలు కానీ వారు చిట్టచివరిగా ఐదు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుందని పండితులు చెబుతున్నారు..

కేవలం ప్రదక్షిణ చెయ్యడం మాత్రమే కాదు.. స్వామివారికి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఈ శ్లోకం చదవాలి.ఆంజనేయం మహావీరం.. బ్రహ్మవిష్ణు శివాత్మకం.. తరుణార్కం ప్రభం శాంతం..ఆంజనేయం నమామ్యహం..అనే శ్లోకం చదువుతూ 108 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఒక ప్రదక్షిణ పూర్తయ్యాక ఈ శ్లోకం చదవాలి. అలా ప్రతి ప్రదక్షిణ పూర్తయ్యాక స్వామివారి ముందుకు వచ్చినప్పుడు ఈ శ్లోకం చదవాలి.. ఇలా చెయ్యాలి.. అప్పుడే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది.. మనం ఏ పని చేసిన అన్ని శుభాలే జరిగితాయి..