తిరుమల అంటే కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి. వేంకటేశ్వరస్వామికి 100 అడుగుల స్థలాన్ని ఇచ్చినది వరాహస్వామి. ఆ సమయంలో వేంకటేశ్వరుడుని స్థలం ఇస్తే నాకు ఎంత మూల్యం చెల్లిస్తావు అనగా.. మీరిచ్చే స్థలానికి వచ్చే భక్తులకు ప్రథమ దర్శనం, ప్రథమ నైవేద్యం మీకు జరిగేటట్లు చేస్తానని శ్రీనివాసుడు మాటిస్తాడు. ఆ ప్రకారమే నేటికి తిరుమలలో ప్రథమ దర్శనం, ప్రథమ నైవేద్యం ఆదివరాహస్వామికే సమర్పిస్తారు.
విష్ణువు స్థితికారకుడు, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం, ధర్మాన్ని కాపాడటం కోసం అనేక అవతారాలు ఎత్తాడు. వాటిలో ప్రధానమైనవి దశావతారాలు. ప్రథమ అవతారం మత్స్య అవతారం, రెండోది కూర్మ అవతారం. మూడో అవతారమే వరాహావతారం. వరాహస్వామినే శ్రీ వరాహమూర్తి, వరాహావతారంగా అభివర్ణిస్తుంటారు. ఈ అవతారంలో స్వామి హిరాణ్యాక్షుడిని చంపి, భూమిని ఉద్దరించి వేదాలను కాపాడాడు. భూమిని హిరణ్యాక్షుడు తీసుకుపోయి బ్రహ్మకు దొరకని చోట దాస్తాడు. ఆ సమయంలో బ్రహ్మ తన తండ్రి అయిన విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. వెంటనే బ్రహ్మ ముక్కులోనించి విచిత్రమైన ఆకారం బయటకు వచ్చి చూస్తుండగానే మహారూపాని ధరించాడు. ఆయనే వరాహస్వామి.
వెంటనే ఆయన అన్నిలోకాలను వెదికి జలంలో అట్టడుగున దాచిన భూమిని కనుగొని దాన్ని పైకి తీసుకవస్తుండగా హిరణ్యాక్షుడు వరాహస్వామితో తలపడుతాడు. అత్యంత భయంకరంగా సాగిన యుద్ధంలో స్వామి హిరణ్యాక్షుడిని వధిస్తాడు. భూమిని ఉద్దరిస్తాడు. జలంపైకి తెచ్చి భూమిని కాపాడుతాడు. ఆ తర్వాత భూమి మొదట సంచరించిన ప్రదేశమే నేటి తిరుమల కొండ. తిరుమల క్షేత్రం మొదట్లో వరాహక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. వేంకటేశ్వరస్వామి తిరుమల కొండ మీద ఉండటానికి అనుమతిచ్చింది వరాహస్వామే.
వరాహస్వామి ఎన్ని రూపాల్లో కొలుస్తారో తెలుసా!
భూమిని ఉద్దరించిన శ్రీ మహావిష్ణువు మూడో అవతరమైన వరాహస్వామిని ప్రధానంగా మూడు రూపాల్లో కొలుస్తారు. అవి…
ఆది వరాహస్వామి
ప్రళయవరాహస్వామి
యజ్ఞవరాహస్వామి
తిరుమలలో ప్రథమ నైవేద్యం ఎవరికో తెలుసా!
తిరుమల అంటే కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి. వేంకటేశ్వరస్వామికి 100 అడుగుల స్థలాన్ని ఇచ్చినది వరాహస్వామి. ఆ సమయంలో వేంకటేశ్వరుడుని స్థలం ఇస్తే నాకు ఎంత మూల్యం చెల్లిస్తావు అనగా.. మీరిచ్చే స్థలానికి వచ్చే భక్తులకు ప్రథమ దర్శనం, ప్రథమ నైవేద్యం మీకు జరిగేటట్లు చేస్తానని శ్రీనివాసుడు మాటిస్తాడు. ఆ ప్రకారమే నేటికి తిరుమలలో ప్రథమ దర్శనం, ప్రథమ నైవేద్యం ఆదివరాహస్వామికే సమర్పిస్తారు.
ప్రముఖ వరాహ దేవాలయాలు
తిరుమల- కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీవారి ఆలయానికి పక్కన ఉన్న కోనేరు పక్కన ఉన్న దేవాలయం. ఇక్కడే వరాహస్వామి ప్రథమంగా వెలిసినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి.
సికింద్రాబాద్-సికింద్రాబాద్ మార్కెట్‌వీధిలో కోనేరు వరాహస్వామి దేవాయలం ఉంది. ఇది కూడా చాలా ప్రాచీనదేవాలయం.
కరీంనగర్- కరీంనగర్‌లో వరాహస్వామి దేవాలయం ఉంది.
సింహాచలం- వరాహ లక్ష్మీ నారసింహస్వామిగా ఇక్కడ ప్రసిద్ధి.
కల్లిడైకురిచ్చి- తిరున్వేలి జిల్లాలోని తామ్రపాణి నదీ తీరాన ఆది వరాహస్వామి దేవాలయం ఉంది.
చెరై- కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని వైపిన్ ద్వీపంలో వరాహస్వామి దేవాలయం ఉంది.
జైపూర్- ఒడిశా రాష్ట్రంలో కటక్‌కు 78కి.మీ. దూరంలో జైపూర్ అనే ప్రదేశంలో యజ్ఞవరాహస్వామి దేవాయలయం ఉంది.
తిరువైందాది- చెన్నైకి సమీపంలో నిత్యకళ్యాణ పెరుమాళ్ దేవాలయంగా వరాహస్వామి దేవాలయం ఉంది.
-కేశవ