ముఖానికి ముసుగు ధరించడాన్ని ఏయే దేశాల్లో నిషేధించారో తెలుసా..?

-

2011వ సంవత్సరంలో ఫ్రాన్స్‌ బురఖాలను బహిరంగ ప్రదేశాల్లో ధరించడాన్ని నిషేధించింది. 2014లో యూరప్‌ మానవ హక్కుల న్యాయస్థానం కూడా ఈ నిషేధం సబబే అని తేల్చింది. 2018లో ఆగస్టు నెలలో డెన్మార్క్‌లో ముఖంపై ముసుగు ధరించడాన్ని నిషేధించారు.

శ్రీలంకలో ఇటీవల జరిగిన ముష్కరుల ఆత్మాహుతి దాడులు, బాంబు పేలుళ్ల ఘటనల్లో మొత్తం 250 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారన్న విషయం విదితమే. ఈ క్రమంలోనే శ్రీలంక ప్రభుత్వం ఇప్పుడక్కడ బురఖా ధరించడాన్ని నిషేధించింది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో బురఖాలే కాదు, ముసుగులు కూడా ధరించకూడదు. అయితే నిజానికి ఇలా బురఖాలు, ముసుగులపై శ్రీలంక మాత్రమే కాదు, గతంలోనూ పలు దేశాలు నిషేధాన్ని విధించాయి. దీనిపై అన్ని వర్గాల్లోనూ భిన్న రకాల స్పందన వస్తున్నా.. కొన్ని దేశాలు మాత్రం ఈ నిబంధనను ఇప్పటికీ అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బురఖాపై ఏయే దేశాల్లో నిషేధం విధించారో ఇప్పుడు తెలుసుకుందాం.

2011వ సంవత్సరంలో ఫ్రాన్స్‌ బురఖాలను బహిరంగ ప్రదేశాల్లో ధరించడాన్ని నిషేధించింది. 2014లో యూరప్‌ మానవ హక్కుల న్యాయస్థానం కూడా ఈ నిషేధం సబబే అని తేల్చింది. 2018లో ఆగస్టు నెలలో డెన్మార్క్‌లో ముఖంపై ముసుగు ధరించడాన్ని నిషేధించారు. అయితే నిబంధనలను ఉల్లంఘించి ముసుగు ధరిస్తే రూ.10వేల ఫైన్‌ చెల్లించాలి. అలాగే 2018 జూన్‌లో నెదర్లాంగ్స్‌ కూడా బహిరంగ ప్రదేశాల్లో ముఖంపై ముసుగు ధరించడాన్ని నిషేధించింది.

జర్మనీలో డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు ముఖానికి ముసుగు ధరించకూడదు. అలాగే ఆస్ట్రియాలో కోర్టులు, పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలు తదితర ప్రాంతాల్లో ముఖంపై ముసుగు ధరించరాదు. 2017 అక్టోబర్‌ నుంచి అక్కడ ఈ నిబంధన అమలులోకి తెచ్చారు. ఇక బెల్జియంలో 2011 జూలై నుంచి, నార్వేలో 2018 జూన్‌ నుంచి, బల్గేరియాలో 2016 నుంచి, ఇటలీలో 2010 నుంచి, స్పెయిన్‌లో 2010 నుంచి ముఖంపై ముసుగు ధరించకూడదనే నిబంధనను అమలు చేస్తున్నారు. అలాగే ఎంతో కాలం నుంచి లక్సంబర్గ్‌, స్విట్జర్లాండ్‌లలోనూ ఇదే లాంటి నిబంధనను అమలు చేస్తున్నారు.

2015లో ముఖానికి ముసుగు ధరించిన కొందరు మహిళలు ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. దీంతో ఛాద్‌, గబోన్‌, కేమరూన్‌, డిఫా, రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలలో ముఖానికి ముసుగు ధరించడాన్ని నిషేధించారు. అలాగే అల్జీరియాలో విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారులు ముఖానికి ముసుగు ధరించరాదనే నిబంధనను 2018 అక్టోబర్‌ నుంచి అమలు చేస్తున్నారు. చైనాలోని జిన్‌జియాంగ్‌ అనే ప్రాంతంలో ముఖానికి ముసుగు ధరించడం, గడ్డం పొడవుగా పెంచడంపై నిషేధం విధించారు..!

Read more RELATED
Recommended to you

Latest news