గుడిలో గంటను ఎందుకు మూడుసార్లు కొడతారో తెలుసా?

-

ప్రతి గుడిలో గంట అనేది ఉంటుంది..దేవుడికి దండం పెట్టుకున్నాక ఖచ్చితంగా గంటను కొడతారు.. అలా కొట్టడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అసలు ఎందుకు కొట్టాలి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అసలు గంట కొట్టడానికి కారణం మన మనసులో ఉన్న ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఉండడానికి అని వేద పండితులు చెబుతున్నారు..భగవంతునికి ప్రసాదం పెట్టి పూజించడం వల్ల మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు. అయితే పూజల విషయంలో అన్నిటి వెనుక కొన్ని అంతర్యాలు దాగి ఉన్నాయి. అలాగే గంటను కొడితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.మన దేశంలో ఎన్నో పురాతన పుణ్య క్షేత్రాలు, దేవాలయాలు ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రాలకు ప్రతి రోజు ఎంతో మంది భక్తులు తరలి వచ్చి భగవంతుని దర్శించుకుంటూ ఉంటారు. మరి కొంత మంది వ్యక్తులు స్వామి వారికి అభిషేకాలుపూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే దేవాలయానికి వచ్చినా భక్తులు కచ్చితంగా గంట కొడుతూ ఉంటారు.

కొంత మంది భక్తులు గంటను ఒక సారి కొడితే మరి కొంత మంది భక్తులు గంటను చాలా సార్లు కొడుతూ ఉంటారు.. అయితే ఒకసారి గంట కొడితే ప్రాణాలకు ప్రమాదం ఉందని అంటున్నారు.. వాస్తవానికి మూడుసార్లు గంట కొట్టడం వల్ల సుఖశాంతులతో పాటు మంచి ఫలితాలు లభిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. అందువల్ల దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మూడుసార్లు గంట మోగించడం ఎంతో మంచిది…అందుకే ఎప్పుడూ గుడికి వెళ్లినా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి..ఆరోగ్యం తో పాటు సుఖ సంతోషాలు వెళ్లువిరుస్తాయి..

Read more RELATED
Recommended to you

Latest news