కొద్దిరోజులు ట్విట్టర్ బ్లూటిక్ ఇష్యూ హాట్ టాపిక్‌గా ఉంది. ఆదాయం పెంచుకుందామని బ్లూటిక్ ప్రీమియ సర్సీసుగా చేస్తే.. అది కాస్తా లేనిపోని చిక్కులు తచ్చిపెడుతుంది. అనుకున్నదొక్కడి.. అయినదొకటి.. అన్నట్లు.. బ్లూటిక్‌ను ప్రీమియం సర్వీసుగా మార్చగానే ఫేక్ అకౌంట్స్ పెరగడంతో చిక్కుల్లో పడింది సంస్థ.
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను ఎలాక్‌మస్క్ చేతిలో పడిన తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకునే దిశగా బ్లూటిక్‌ను ప్రీమియం సర్వీసుగా మార్చేశారు మస్క్. ఆదాయం పెరగడం సంగతి అలా ఉంచితే కొత్త చిక్కులు వచ్చి పడ్డాయని ట్విట్టర్ వర్గాలు తలపట్టుకున్నాయి. ఇదంతా పక్కకు పెడితే.. తాజాగా ట్విట్టర్ లోగోనే మార్చేసాడు మస్క్. పిట్ట ఆకారంలో ఉన్న ట్విట్టర్ లోగోను కుక్క లోగో గా మార్చేశాడు మస్క్. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.