స్నేహితుల మధ్య గొడవే.. మహా భారత యుద్ధానికి కారణం.. వీరుల ప్రతీకారాలు.. తెలుసుకుందాం

మన పురాణాలు, ఇతిహాసాలు చదివితే ప్రపంచాన్ని సులువుగా ఆకళింపు చేసుకోవచ్చు అనడంలో ఎలాంటి సందేహాలు అవసరంలేదు. పంచమవేదంగా పిలువబడే మహాభారతంలోని అత్యంత కీలక ఘట్టాల్లో ద్రోణ, ద్రుపద భాగం ఒకటి. ద్రోణ ద్రుపద అవమాన ప్రత్యవమానాలు సమాజాన్ని ప్రభావితం చేసే సంఘటనలకు దారితీశాయి. ఒక్కసారి ఆ కథేంటో తెలుసుకుందాం…

Do you the revenges of warriors who influenced India

ద్రోణుడు భరాద్వాజుని కొడుకు, ద్రుపదుడు వఋషతుని కొడుకు. భారద్వాజుడు, వఋషతులు ఇద్దరు మంచి మిత్రులు. అలాగే వారి కొడుకులు మంచి మిత్రులు. ఇద్దరు ఒకే గురువు దగ్గర విద్యను అభ్యసిస్తారు. తర్వాతి కాలాలలో ద్రుపదుడు పాంచాల రాజుయ్యాడు. ద్రోణుడు వివాహం చేసుకున్నాక ఆయనకు అశ్వత్థాముడు జన్మించాడు. కానీ ఆయన దారిద్య్రంతో పిల్లవాడికి పాలు దొరకనిస్థితి. ఆ పరిస్థితిలో పరుశరాముడి దగ్గరికి వెళ్లిన ద్రోణుడికి ఆయన శస్ర్తాస్త్ర విద్యలను నేర్పిస్తాడు. కానీ ద్రోణుడికి ఆ సమయంలో కావల్సింది ధనం. అది దొరకలేదు. దాంతో చిన్నప్పటి మిత్రుడు ఆయిన ద్రుపదుడి దగ్గరికి వెళ్తాడు. కానీ ఆశించిందొకటి … అయిందొకటి. ద్రుపదుడు ద్రోణుని చూసి ఎవరో కొత్త వ్యక్తిని చూసినట్లు చూశాడు. నేను నీ బాల్య మిత్రుడను అని చెప్పినా పట్టించుకోలేదు. పైగా ధనపతితో దరిద్రుడికి స్నేహమేమి? నీవు పేద బ్రాహ్మణుడవి నేనొక మహారాజును మనకు స్నేహమేమిటి అని అన్నాడు.

ద్రుపదుని కలిసిన ద్రోణుడికి దారిద్య్రబాధ తీరలేదు సరిగదా, ఆ బాధకు అవమాన బాధ తోడైంది. తరువాత కౌరవుల ఆస్థానంలో అస్త్రవిద్యాచార్యుడుగా చేరడంతో దారిద్య్ర బాధ తీరింది.గానీ అవమాన బాధ తీరలేదు. ఆ బాధ తీరేదెలాగా అని ఆలోచించాడు. ఏ గురువుకైనా జీవితంలో నిజమైన బలం శిష్య బలం.
సమర్థుడైన శిష్యునితో ద్రుపదున్ని అవమానపర్చాలనుకున్నాడు. అందుకు అనుగుణంగా అర్జునున్ని తీర్చిదిద్దాడు. ద్రుపదుని మీద ప్రయోగించాడు.

అర్జునుడు ద్రుపదున్ని యుద్ధంలో ఓడించి పట్టి, కట్టి తెచ్చి గురువు పాదాల వద్ద పడవేశాడు. అవమాన భారంతో కఋంగిపోతున్న ద్రుపదున్ని చూసి ద్రోణుడు అటూ ఇలూ పొర్లించి వీరెవ్యరయ్యా ద్రుపద మహారాజులే అని వెటకారంగా సంబోధించాడు. పలు మాటలతో ఎగతాళి చేశాడు. అర్జునుని బాణాల కంటే ద్రోణుడి మాటలు అతన్ని ఎక్కువగా బాధించాయి.

క్షత్రియుడైన ద్రుపదుడు ఈ అవమానాన్ని సహించగలడా? అయినా అర్జునుని పరాక్రమం ద్రుపదుని బాగా ఆకర్షించింది. అంతటి వీరకిషోరం తన కొడుకు అయితే బాగుండునని అనుకున్నట్లున్నాడు. కానీ కొడుకు కాలేడు. అయితే అల్లుడు కావాలి. అంతే.. ద్రుపదుడు భక్తితో బ్రాహ్మణులకు సేవించాడు. యజోపయాజలు ఆధ్వర్యంలో పుత్రకామేష్టి చేశాడు. అర్జునునికి భార్యకాగల కూతురిని, ద్రోణుని వధించగల కొడుకును ఇమ్మని అగ్నిహోత్రుని ప్రార్థించాడు. హోమగుండం నుంచి ద్రౌపది, దఋష్టద్యుమ్నులు ఉద్భవించారు. వారిలో ద్రౌపది పాండవుల ఇల్లాలిగా మారింది. దఋష్టద్యుముడు భారత యుద్ధంలో సేనానిగా యుద్ధాని నడిపిస్తాడు.

ద్రోణుని, ద్రుపదుడి అవమాన ప్రత్యావమానాలు వాళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. అవి సమాజాన్ని ప్రభావితం చేసే సంఘటనలకు దారితీశాయి. మహాభారతంలో ద్రౌపది పాత్ర గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు. మహాయుద్ధానికి దారితీసిన బాల్యమిత్రుల గాథ ఇది.

– కేశవ