జాతకంలో శని ప్రభావం ఎక్కువగా ఉందా?..పోవాలంటే ఇలా చెయ్యాలి..

ఎంత సంపాదిస్తున్న కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండటం లేదని చాలా మంది బాధపడతారు.. అందుకు కారణం శని ప్రభావం.. శని ప్రభావం మన జాతకంలో ఉంటే ఆర్ధిక, మానసిక ఇబ్బందులు తప్పవు.. ఈ విషయం పండితులో కొన్ని విషయాలను చెప్పారు.. శని ప్రభావాన్ని పోగొట్టే మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక వ్యక్తి జీవితంలో శని దేవుడు అశుభ స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే దురదృష్టం వెంటాడుతుంది. శని దేవుడి దయ లేకపోతే జీవితంలో విజయం సాదించలేడు. శని దేవుడు చాలా రకాల ఇబ్బందులకు గురి చేస్తాడు. శని దేవునికి ఇష్టమైన రంగు నలుపు. శని దేవునికి పూజ చేసేటప్పుడు కానీ అలాగే సమర్పించే దుస్తులు కేవలం నలుపు రంగులో మాత్రమే ఉండాలి..

వాస్తవానికి శనికి నలుపు రంగు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి అందుకే శనికి నలుపు రంగులో ఉండే వస్తువులనే సమర్పింస్తుంటారు. అయితే ఒకవేళ జాతకంలో శని దోషాలు ఉంటే కొన్ని రకాల విషయాలను పాటించడం వల్ల అవి తొలగిపోయి సంతోషంగా ఉంటారు. శని దోషంతో బాధ పడుతుంటే శనివారం రోజు శని దేవాలయానికి వెళ్లి మీ చెప్పులు వదిలి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్లిపోవాలి. అయితే మీరు అలా చేసినట్టు ఎవరికీ చెప్పకూడదు.. ఏళ్ల శని నుంచి విముక్తి కలుగుతుంది..

మన జాతకంలో శని దోషాలను తొలగించడానికి మీ దగ్గర పని చేసే సేవకులను వీలైనంత సంతోషంగా ఉంచాలి. ఎవ్వరికి బూట్లు లేదా చెప్పులు బహుమతిగా ఇవ్వకూడదు. అలాగే ఎవరి నుండి కూడా బూట్లు, చెప్పులు లాంటివి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.పూజకు నలుపు రంగును వాడము.. అదే శనికి ఇష్టమైన రంగు…నలుపు రంగులో ఉండే వస్తువులను సమర్పించడం మొదలయ్యింది. జాతకంలో శని దోషం ఉంటే దానిని తొలగించడానికి రావి చెట్టుని పూజించాలి. రావి చెట్టును ప్రతి శనివారం పూజిస్తే శని దోషం తొలగి పోతుంది. కష్టాల నుండి విముక్తి పొందవచ్చు.. నల్ల నువ్వులు, ఉలవలు వంటివి దానం చెయ్యడం మంచిది.