వినాయకుడు, హనుమంతుడు సాధారణంగా బ్రహ్మచారులుగా పేర్కొంటారు.వినాయకుడు హస్తిముఖుడు, హస్తమంటే తుండం. హస్తం (తుండం) కలిగింది హస్తి (ఏనుగు). ఈ రూపాన్ని చూస్తూ మనం గమనించాల్సింది ఈయన ఏనుగు ముఖంవాడనే విశేషాన్ని కాదు. ఈయన జన్మనక్షత్రం హస్త హస్తా నక్షత్రం కన్యారాశికి చెందింది కాబట్టి ఈయన్ని అవివాహితుడన్నారు.
అయితే లోకంలో వివాహం కానిదే కొన్ని కార్యాలకు అర్హత సిద్ధించదు కాబట్టి వినాయకునికి సిద్ధి, బుద్ధి అనేవారు భార్యలుగానూ, క్షేమం, లాభం సంతానంగానూ చెబుతారు. ఈ విషయంలో పెద్దగా అన్వేషణ చేయాల్సిన పనిలేదు. శాస్ర్తాన్ని తార్కిక కోణంలో అర్థం చేసుకుని గణపతి ఆరాధనతో మనకు వచ్చే ఫలితాలను ఆస్వాదిస్తే సరిపోతుంది.
– కేశవ