రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస.. ఏంటీ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనాలి కదా.. అలా అన్నారు ఏమిటి ? అని ఆశ్చర్యపోతున్నారా..? ఏమీ లేదండీ.. స్వామి నిత్యానందుడు ఉన్నాడు కదా.. అవును.. అతనే.. అయితే ఏంటంట.. దేశం విడిచిపెట్టి ఎక్కడికో పోయి దీవి కొని సొంతంగా ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.. కులాసాగా ఉన్నాడు.. అయితే ఏమిటట..? అంటారా..? ఏమీ లేదు.. అతనే ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస.. ను ఏర్పాటు చేశాడు. అవును.. నిజ్జంగా నిజం..!
బాబోయ్.. ఇంక ఆగండి.. నవ్వలేకుండా ఉన్నాం అంటారా.. అయినా విషయం అలాంటిది మరి.. అవును.. ఎందుకంటే.. అతను చేసే పనులన్నీ నిజంగా చిత్రంగానే ఉంటాయి. అతనిపై అత్యాచార కేసు, కిడ్నాప్ కేసు.. వగైరాలు ఉన్నాయి. కోర్టులు కూడా అతనికి బెయిల్ ఇవ్వలేదు. అయినప్పటికీ తాను నిర్దోషినని అన్నాడు. తీరా చూస్తే.. రాత్రికి రాత్రే దేశం విడిచి బయటకు చెక్కేశాడు. అతనిపై ఇంటర్‌పోల్ కూడా దృష్టి పెట్టిందంటే.. అతను ఏ స్థాయి నేరాలు చేశాడో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ తాను సర్వసంగ పరిత్యాగినని.. అమాయకున్నని.. దేవుని ప్రతిరూపాన్ననని.. అన్నీ విడిచిపెట్టి సన్యాసిగా బతుకుతున్నానని ఇప్పటికీ చెప్పుకుంటుంటాడు. ఇవన్నీ విన్న తరువాత ఇంక నవ్వు రాకుండా ఏడుపు వస్తుందా..?
అప్పట్లో సినీ నటి రంజితతో నిత్యానందుడి వీడియోలు బయటకు వచ్చాక కూడా తన తప్పులను అతను కప్పి పుచ్చుకునే యత్నం చేశాడు. అయినప్పటికీ ఇలాంటి వారిని నమ్మే కొందరు భక్తులు ఉంటారు కదా.. కనుక వీరు చేసే అక్రమాలకు అడ్డు అదుపూ ఉండదు. అందుకనే అలాంటి వారి నుంచి తీసుకున్న డబ్బులతో దీవిని కొన్నాడు. రేప్పొద్దున ఓ ఖండాన్నే కొన్నానని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే.. నిత్యానందుడు కదా.. అతని లీలలే లీలలు..!! మరి కొత్తగా ఏర్పాటు చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసలో సాధారణ జనాలు డబ్బులు వేయవచ్చా..? బ‌్యాంకు కేవలం అతని కోసమేనా ? అతని భక్తులకా ? అంటే.. అందుకు ఆ నిత్యానందుడే జవాబు చెప్పాలి..!!