జ్యేష్ఠ అమావాస్య నాడు సూర్యుడికి ఎర్రటి పువ్వులను సమర్పిస్తే..?

ప్రతినెలలో పౌర్ణమి అమావాస్యలు సర్వసాధారణం. కానీ, కొన్ని ప్రత్యేకమైనవి. ఈ రోజులను పవిత్రంగా భావించి పూజకార్యక్రమాలు చేపడతారు.ఈ నెల 10వ తేదీన రాబోతున్న జ్యేష్ఠ అమావాస్య (Jyeshtha Amavasya) కూడా అత్యంత ప్రాముఖ్యత చెందింది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున వట సావిత్రి వ్రతం ఆచరించనున్నారు.

అంతేకాదు ఈరోజు మరో ప్రత్యేకం కూడా ఉంది. శనిజయంతి అని కూడా అంటారు. ఈరోజు పూజలు చేస్తే ఎంతో మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతారు. ఎంతో పవిత్రమైన ఈరోజు పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం.


జ్యేష్ఠ అమావాస్య రోజున వేకువ జామున నదీస్నానం ఆచరించాలి. ఇది ఎంతో శుభసూచికం.అయితే నదీ ప్రాంతానికి వెళ్లలేని వారు ఒక చెంబు గంగాజలం తీసుకువచ్చి స్నానం చేసే నీటిలో కలిపి, స్నానం చేసుకోవాలి. సూర్య భగవాణుడికి కూడా పూజించాలి. జ్యేష్ఠ అమావాస్య నాడు ఒక రాగి చెంబులో అక్షితలు తీసుకోవాలి. అందులో ఎర్ర పుష్పాలను వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. పైగా ఈ అమావాస్య నాడు పితృ దేవతల కోసం ఉపవాస్యం ఉండాలి అంటారు. అలాగే పేదలకు వారి పేరు మీద దాన ధర్మాలు చేయటం వల్ల పితృ దేవతలు సంతోషిస్తారట.

వట సావిత్రి వ్రత విశిష్టత

వట సావిత్రి వ్రతం మహిళలు పవిత్రమైంది. ఈరోజు వ్రతమాచరించే వారు తమ భర్త ఆయుష్షు కోసం ఉపవాస దీక్షలతో పూజలు చేస్తారు. అదేవిధంగా శని దేవుడు అమావాస్య రోజు జన్మించడం వల్ల శని జయంతి అని కూడా చెప్పబడుతోంది. ఈరోజు శనీశ్వరుడికి పూజించడం వల్ల సమస్యలు తొలగుతాయంటారు. జ్యేష్ఠ అమావాస్య రోజు శని జయంతిని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. శనీశ్వరునికి భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.