రామాయణం (బాలకాండ)-3 ఈ ప్రశ్నతో రామాయణం ప్రారంభమైంది!

-

రామాయణం అంటే తెలియని వారు ఉండరూ. దీన్ని రాసింది వాల్మీకి అని తెలుసుకున్నాం. అయితే రామాయణాన్ని రాయడానికి ముందు వాల్మీకి నారదుడిని వేసిన ప్రశ్నతో రామాయణానికి అంకురార్పణ జరిగింది అని చెప్పవచ్చు. ఎప్పుడు తపస్సు,స్వాధ్యాయం చేసే నారద మహర్షికి వాల్మీకి నమస్కారం చేసి ఈ విధంగా ప్రశ్న అడిగాడు.. ఓ మహర్షి విష్ణులోకం నుంచి సర్వలోకాలు తిరిగే బ్రహ్మమానస పుత్రులు మీరు. సద్గుణాలు, పరాక్రమమూ, సత్యవ్రతం, సమర్థతా, ధైర్యం, సచ్ఛరిత్ర, పట్టుదల, అన్ని భూతాలందిష్టం, పాండిత్యం, కృతజ్ఞతాభావం, ధర్మబుద్ధి, క్రోధాన్ని జయించిన తనమూ, కాంతీ, అసూయలేనితనం కలవాడు, కోపం వస్తే దేవతనైనా భయపెట్టగలవాడు, అందరికీ ఇష్టుడూ ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించాడు. మొత్తం 16 గుణాలు ఉన్న సత్పురుషుడు ఎవరు అని అగిగాడు.


కోస్వస్మిన్ సాంవ్రతంలోకే గుణావాన్ కశ్చవీర్యవాన్?
జాతరోషస్య సంయుగే?
ఆ ప్రశ్నవిని నారదుడు నవ్వుతాడు. ఒక్క క్షణం ఆగి ఇన్ని సుగుణాలన్నవాడు భూలోకంలో ఉండటం అసంభవం. అయినా ఇక్షాకు వంశంలో పుట్టి రాముడుగా ప్రసిద్ధికెక్కిన మహాపురుషుని వృత్తాంతం చెప్తా అని సూక్ష్మంగా ఆయన గురించి నారదుడు చెప్తాడు. నారదుడు గురువుగా వాల్మీకి శిష్యుడుగా మారుతాడు. మరో విశేషం రామాయణంలో ఏ శిష్యుడు గురువు వద్దకు రాడు. గురువే శిష్యుని వద్దకు వస్తారు. ఇది ఆశ్చర్యకరమైన అంశం. కాబట్టి ఉత్తముడైన శిష్యుడునిపిస్తే అడుగకుండానే గురువే శిష్యునికి ఉపదేశం చేయవచ్చు-చేయాలి అని రామాయణం బోధిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news