షిర్డీ భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై బాబా సమాధిని తాకే భాగ్యం

-

సాయిబాబా భక్తులకు షిర్డీ సాయి సంస్థాన్‌ గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్నిరోజులు బాబా సమాధిని తాకనీయకుండా ఆంక్షలు పెట్టిన సంస్థాన్.. ఇప్పుడు ఆ ఆంక్షలను ఎత్తివేసింది. ఈ విషయాన్ని సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భాగ్యశ్రీ బనాయత్ తెలిపారు.

షిర్డీ సందర్శించే ప్రతి ఒక్కరికి బాబా సమాధిని తాకాలనే ఆశ ఉంటుంది. ఒకప్పుడు బాబాని తాకేందుకు అనుమతి ఉన్నా.. రద్దీ పెరుగుతున్నందున షిర్డీ సాయి సంస్థాన్ ఆలయ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. భక్తులకు, సాయి సమాధికి మధ్య గాజు అద్దాన్ని అడ్డుగా పెట్టింది. ఒక్క వీఐపీ భక్తులకు మాత్రమే బాబా దగ్గరకు వెళ్లి ఆ సమాధిని తాకే అదృష్టం దక్కేది. సాధారణ భక్తులు మాత్రం దూరం నుంచే దర్శనం చేసుకోవాల్సి వచ్చేది.

అయితే ఇప్పుడు సామాన్యులకు కూడా సాయి సమాధిని తాకే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సాయి సంస్థాన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ భాగ్యశ్రీ బనాయత్‌ తెలిపారు. అంతే కాకుండా భక్తుల కోరిక మేరకు సాయి సచ్చరిత్రను వివిధ భాషల్లో ప్రచురించే ప్రణాళికలో ఉన్నామని సాయి సంస్థాన్​ పేర్కొంది. ఈ నిర్ణయాలపట్ల షిర్డీ గ్రామస్థులతో పాటు సాయి భక్తులు ఆనందంగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news