ఏడిస్తే కష్టం తీరదేమో కానీ.. బాధ తగ్గుతుంది.! ఇంకా ఈ లాభాలు కూడా..!

-

ఏడిస్తే: ఏడిస్తే.. కష్టం తీరుతుందా..? నీ సమస్యకు పరిష్కారం వస్తుందా.. ఇంత సేపు ఏడిస్తే.. ఇంత కష్టం తీరుతుంది అంటే చెప్పు అంత సేపు ఏడుస్తా.. ఇలా అనే వాళ్లు చాలా మంది ఉంటారు. ఏడవడం వల్ల తలనొప్పి తప్ప ఇంకేం రాదు అనుకుంటారు. కానీ ఏడవటం వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.. ఏడవాలనిపిస్తుందా.. ఏడ్చేయ్‌… ఆపుకోని ఆగం కావద్దు అంటున్నారు నిపుణులు..

ఏడుపు వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. శరీరం భావాలకు ప్రతిస్పందించినప్పుడు, మనసు కన్నీటి గ్రంథి నుంచి కళ్ల ద్వారా బయటకు వచ్చే నీటిని కన్నీళ్లుగా పిలుస్తాము. గుండె బలహీనంగా ఉన్నవారు త్వరగా ఏడుస్తారట. మీరు మీ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించి.. ఏడ్చినట్లయితే.. అది చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుందని సైన్స్ నిరూపించింది. స్వేచ్ఛగా నవ్వడం ఆరోగ్యానికి మంచిదని భావించినట్లే, అప్పుడప్పుడు ఏడుపు కూడా శరీరానికి, మనస్సుకు ఎంతో మేలు చేస్తుంది.

 

గుండె బలహీనంగా ఉన్నవారు త్వరగా ఏడుస్తారని అంటారు. కానీ మీరు మీ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించి.. ఏడ్చినట్లయితే.. అది చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుందని సైన్స్ నిరూపించింది. స్వేచ్ఛగా నవ్వడం ఆరోగ్యానికి మంచిదని భావించినట్లే అప్పుడప్పుడు ఏడుపు కూడా శరీరానికి, మనస్సుకు ఎంతో మేలు చేస్తుంది.

ఎక్కువగా భావోద్వేగాలకు గురైనప్పుడు కన్నీళ్లు వస్తుంటాయి. దీని వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుంది. మీరు ఏదైనా విషయంలో కలత చెంది దాన్ని సరిదిద్దుకోలేకపోతే.. మనస్సారా ప్రశాంతంగా ఏడవండి. దీని వల్ల మీకు ఎంతో రిలీఫ్ లభిస్తుంది. అంతే కాదు మీ ఒత్తిడి కూడా తగ్గుతుంది.

ఏడవడం వల్ల మన కళ్లకు ఎంతో మంచిది. కన్నీళ్లు కళ్లను శుభ్రపరుస్తాయి. అనేక రకాల బ్యాక్టీరియా నుంచి రక్షిస్తాయి. కన్నీళ్లలో ఉండే లైసోజైమ్ భాగం శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది, ఇది అనేక బయోటెర్రర్ ఏజెంట్ల నుండి కళ్ళను రక్షిస్తుంది.

2015 అధ్యయనంలో ఏడుపు పిల్లలు రాత్రి బాగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుందని చెప్పారు పిల్లల వైద్య నిపుణులు. పెద్దల విషయంలోనూ అలాగే ఉంటుంది. ఏడుపు మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది. నిద్రను మెరుగుపరుస్తుంది.

మీరు చాలా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏడవడం మీ మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. బాధపడుతూ ఏడిస్తే మెదడులో ఆక్సిటోసిన్‌, ఎండార్ఫిన్‌ అనే ఫీల్‌ గుడ్‌ రసాయనాలు విడుదలవుతాయి. ఆక్సిటోసిన్‌, ఎండార్ఫిన్‌ వల్ల శారీరక, మానసిక భావోద్వేగాల్లో మార్పులు కలుగుతాయి. శరీరానికి నొప్పిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాదు.. మీరు బాధలో ఉండి ఏడిస్తే.. మీ గుండె స్ట్రాంగ్‌ అవుతుంది. ఏది అయితే అది అవుతుంది అని ఆ సమస్యను ఎదుర్కోనే ధైర్యం వస్తుంది.

ఒక వ్యక్తి కొంత ఒత్తిడి కారణంగా ఏడ్చినప్పుడు.. శరీరంలో ఉత్పత్తి చేయబడిన టాక్సిన్స్ కన్నీళ్ల సహాయంతో నెమ్మదిగా బయటకు రావడం ప్రారంభిస్తాయి. ఈ కన్నీళ్లు వివిధ రకాల మంచి హార్మోన్లను విడుదల చేస్తాయి. ఇవి శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news