పంచాయితీ సెక్రటరీలపై సర్కార్ సీరియస్

-

తమ జాబ్ లు రెగ్యులరైజ్ చేయాలని జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఏప్రిల్ 28 నుంచి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెల 1 నుండి అన్ని కలెక్టరేట్ల ఎదుట దీక్షలకు కూర్చున్నారు. అయితే రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్ తో సమ్మెకు దిగిన జూనియర్ పంచాయతీ సెక్రటరీలపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది.

ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసింది. రేపు సాయంత్రం ఐదు గంటల లోపు విధుల్లో చేరాలని ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొంది. విధుల్లో చేరకుంటే ఉద్యోగాలనుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా నోటీసులు జారీ చేశారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం పంచాయతీ సెక్రటరీలు 11 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news