దరిద్రం తొలగిపోయి అంతా మంచే కలగాలంటే ఇలా చెయ్యండి..!

ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో మంచి జరగాలని అనుకుంటూ ఉంటారు. మంచి జరగాలని పూజలు చేయడం పాజిటివ్ గా ఉండటం ఇలాంటివి ఎన్నో ఫాలో అవుతూ ఉంటారు. అయితే కొంత మంది ఇళ్లల్లో మాత్రం ఎంత కష్ట పడినా సరే అనుకున్న ఫలితాలు రావు. చదువు రాక పోవడం, శుభకార్యాలు చేయలేక పోవడం, ఆహారం లభించకపోవడం ఇలాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి.

 

అయితే నిజానికి అష్టైశ్వర్యాలు ఎలా ఉంటాయో అష్టదరిద్రాలు కూడా అదే విధంగా ఉంటాయి. అయితే అష్ట దరిద్రాలు ఈ విధంగా తొలగించుకోవచ్చు. మరి అది ఎలానో చూసేయండి. లింగాష్టకం, దారిద్ర దహన స్తోత్రం చదవడం వల్ల అష్ట దరిద్రాలు దూరమవుతాయి. అదే విధంగా బాల త్రిపుర సుందరి అమ్మ వారికి శివార్చన చేయడం ద్వారా తొలగించుకోవడానికి అవుతుంది.

గోమాత తో కూడా దరిద్రాన్ని సులభంగా తొలగించచ్చు. ఎందుకంటే సకలదేవతలు గోమాత లో ఉంటాయి కనుక. గోమాతకు ఆహార పదార్థాలను తినిపిస్తే కూడా దరిద్రం పోతుంది. గోమాత తోకను పూజిస్తే మనం శుభ ఫలితాన్ని పొందొచ్చు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది ఉన్నవాళ్లు గోమాత తోకను తాకి పూజిస్తే మంచిది. ఇలా గోమాతను పూజించడం వల్ల మీకు దరిద్రం తొలగిపోతుంది. గోమాత తోక వెంట్రుకలను తీసి  తాయత్తు లో కట్టుకుంటే చక్కటి ఫలితాలు పొందవచ్చు అలాగే ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. తద్వారా ఆనందంగా ఉండచ్చు.