వాస్తు: పూర్వికుల ఫోటోలని ఇలా ఉంచుతున్నారా…? అయితే సమస్యలు తప్పవు..!

సాధారణంగా అందరి ఇళ్ళల్లో పూర్వీకుల ఫోటోలను పెడుతూ ఉంటారు. వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ల దీవెనలు ఉండాలని ఇళ్లల్లో వాళ్ళ యొక్క ఫోటోలుని పెడతారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం దీనికి సంబంధించి కొన్ని విషయాలు పండితులు చెప్పడం జరిగింది.

నిజంగా పూర్వీకుల ఫోటోలని ఇంట్లో ఉంచుకోవచ్చా..?, ఒకవేళ వాటిని ఉంచితే ఎక్కడ పెట్టాలి…?, ఎలా పెట్టాలి..?, దాని వల్ల పాజిటివిటీ వస్తుందా..?, నెగిటివిటీ వస్తుందా ఇలా అనేక విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం పూర్తిగా చూసేయండి.

వాస్తు శాస్త్రం ప్రకారం మరణించిన ఫోటోలని వేలాడ తీయడం మంచిది కాదు అని అంటున్నారు. అయితే వాటిని చెక్క స్టాండ్ లాంటి వాటి మీద ఉంచితే మంచిది అని అంటున్నారు. అలాగే ఎక్కువ ఫోటోలు పెట్టడం కూడా మంచిది కాదని అంటున్నారు. అలానే వాటిని పెట్టినప్పుడు ఇంట్లోకి రాగానే మొట్టమొదట అందరూ చూసే విధంగా ఉండటం మంచిది కాదు. దాని వల్ల నెగిటివిటీ వస్తుంది అని పండితులు చెప్పడం జరిగింది.

కొందరి ఇళ్ళల్లో పూర్వీకుల ఫోటోలని దేవుడు మందిరం లో పెట్టి పూజిస్తూ ఉంటారు. అయితే ఆ ఫోటోలుని పెట్టడం వల్ల చెడు జరుగుతుందని దేవుడు మందిరం లో ఫోటోలు పెట్టకూడదు అని చెప్తున్నారు. అలా చేస్తే కుటుంబ కలహాలకి కారణం అవుతాయి అని కూడా చెప్పడం జరిగింది. అలానే బెడ్ రూమ్ లో పూర్వికులు యొక్క ఫోటోలను తగిలించకూడదు.

వంటింట్లో కూడా పెట్టడం మంచిది కాదు. ఎప్పుడు కూడా ఇటువంటి ఫోటోలు ని హాల్ లేదా లివింగ్ రూమ్ లో పెట్టాలి. అలానే మరణించిన వాళ్ళ ఫోటోలు పక్కన బ్రతికి వున్న వాళ్ళ ఫోటోలు పెట్టడం మంచిది కాదు. దీని వల్ల బ్రతికి వున్న వాళ్ళ యొక్క జీవిత కాలం తగ్గిపోతుంది. అలానే పూర్వికులు యొక్క ఫోటోలని ఉత్తరం దిక్కు వైపు ఉంచడం మంచిది. ఈ ఈ విధంగా అనుసరిస్తే ఇబ్బందులు రావు.