ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు.. రేపు విచారణ !

-

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సిబిఐ నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాధ్ రెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలపై సిబిఐ ఇతన్ని విచారణ చేస్తోంది. కాగా ఈ మధ్యన ముందస్తు బెయిల్ కు వెళ్లడంతో కొంత ఆలస్యం జరిగింది. ఇక తాజాగా సిబిఐ అవినాష్ రెడ్డికి మరోమారు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులో పేర్కొన్న ప్రకారం తెలంగాణ హైదరాబాద్ లోని కోఠి సిబిఐ ఆఫీస్ కు విచారణ నిమిత్తం హాజరు కావాలని తెలుస్తోంది. కాగా ఈ రోజునే అవినాష్ రెడ్డి కడపకు వెళ్లగా, ఈ నోటీసు అందిన వెంటనే మళ్ళీ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారట. కాగా రేపు జరిగానున్న సిబిఐ విచారణలో కీలక విషయాలు అవినాష్ రెడ్డి నుండి తెలుసుకోవడానికి సిబిఐ అధికారులు ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది.

 

 

ఇప్పటికే ఈ కేసు సుదీర్ఘ కాలం నుండి జరుగుతుండడంతో త్వరగా పూర్తి చేయాలనీ పైనుండి ఆర్డర్స్ ఉన్నాయి. మరి రేపు విచారణలో అవినాష్ రెడ్డి కీలక విషయాలు బయటపెడతాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news