ఇంట్లో ఉంచుకుంటే అపశకునం అని నమ్మే కొన్ని మూఢ నమ్మకాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం.

-

నమ్మకాలనేవి మనసుకు సంబంధించినవి. మనం ఏం నమ్ముతామో అది జరగాలన్నా నియమం ఏమీ లేదు. అందుకే కొందరు కొన్ని విషయాల్లో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. ముఖ్యంగా వాస్తు, జాతకాల విషయాల్లో చాలా పకడ్బందీగా ఉంటారు. వాళ్ళు విన్నది, చేసినది నిజం అయినా కాకపోయినా నమ్మడం మాత్రం ఆపరు. ముందే చెప్పుకున్నట్టు నమ్మకం అనేది మనసుకు సంబంధించినది. ప్రపంచ దేశాల్లో నమ్మే కొన్ని మూఢ నమ్మకాలని ఇక్కడ తెలుసుకుందాం.

రివాల్వింగ్ కుర్చీ..

వాడని రివాల్వింగ్ కుర్చీ ఇంట్లో ఉండకూడదని కొందరి అభిప్రాయం. స్టోర్ రూమ్ లో పెట్టినప్పటికీ గాలికి ఊగుతూ ఉండడం వల్ల అదోలాటి డిస్టర్బెన్స్ కలుగుతుందని నమ్ముతారు. అందుకే రివాల్వింగ్ కుర్చీ అది వాడనట్లయితే ఇంట్లో ఉంచుకోకపోవడం మంచిదని చెబుతున్నారు.

పగిలిన గడియారం

గడియారం కాలాన్ని సూచిస్తుంది. ఐతే పగిలిన గోడ గడియారాన్ని కానీ, పనిచేయని గడియారాన్ని కానీ ఇంట్లో ఉంచుకోకూడదని నమ్ముతారు.

జీవితంలో జరగాల్సిన పనులు జరగవని, ముందుకొచ్చేవి కూడా వెనక్కి వెళ్ళిపోతాయని నమ్ముతారు.

చిందరవందరగా ఉన్న పక్క

మనం పడుకునే పక్క చిందర వందరగా ఉంటే మంచిది కాదని కొందరి నమ్మకం. దానివల్ల నిద్ర సరిగ్గా పట్టదని ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటుంటారు. అందుకే పక్కని నీట్ గా సర్దుకోవాలని, దిండు కూడా సరిగ్గా వేసుకోవాలని సలహా ఇస్తారు.

తెరిచి ఉంచిన గొడుగు

ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ ఈజిప్టు దేశంలోని ప్రజలు దీన్ని బాగా నమ్ముతారు. తెరిచి ఉంచిన గొడుగు ఇంటి పరిసరాల్లో ఉండకూడదని అనుకుంటారు. వర్షం పడేటపుడు తప్ప సాధారణ సమయంలో తెరిచి ఉంచిన గొడుగుని ఇంటి పరిసరాల్లో ఉంచుకోరు.

Read more RELATED
Recommended to you

Latest news