చనిపోయే ముందు వ్యకుల ప్రవర్తన ఇలానే ఉంటుందట..! వాళ్ల నీడలు కనిపించటం..

-

ఎప్పుడు పుడతామో, ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో చావుపుట్టకుల్లో పుట్టుకను మాత్రం మనిషి నిర్ణయిస్తున్నాడు. పలానా టైంకు, పలానారోజు ముహుర్తం పెట్టుకుని మరీ డెలివరీ చేయించుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి.. అయితే చావు మాత్రం మనిషి తనంతట తాను కావాలని ఏదైనా చేసుకుంటే తప్ప సహజంగా ఎప్పుడు వస్తుందనేది ఎవరకి తెలియదు. అయితే ప్రతిమనిషి చనిపోయే ముందు. అంటే చనిపోతాడని ఇంకా డిసైడ్ అయిపోయాక ఒకేలా ప్రవర్తిస్తాడట.

మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. మనిషి చనిపోయే ముందు. అతను ఏ మతం, ఏ కులం అయినా ఏసుప్రభు కనిపిస్తాడని చెబుతుంటారు. అంటే చనిపోయే కొన్ని నిమిషాల ముందు..ఆ శరీరానికి ఇక తను బతకను అని తెలిసిపోతుంది. అప్పుడే కాస్త వింతగా ప్రవర్తిస్తుంటాడు. చనిపోయేముందు వ్యక్తుల ప్రవర్తన దాదాపుగా ఒకేలా ఉంటుందట.. అంతేకాదు ఓ మాటను పదేపదే ఉచ్చరిస్తారట కూడా. ఇంకా అనేక విషయాల గురించి అమెరికాలోని ఓ నర్సు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చకు దారితీస్తోంది.

జూలీ అనే ఆమెకు. దాదాపుగా 14 ఏళ్లు నర్సుగా పనిచేసిన అనుభవం ఉంది. అందులో 9 ఏళ్లు ఐసీయూ నర్సుగా పనిచేసిందట. లాస్‌ ఏంజెల్స్‌, కాలిఫోర్నియాలలో కూడా 5 ఏళ్లు నర్సుగా పనిచేసింది. అమె తన సర్వీసులో అనేక మంది మరణించడం కళ్లారా చూసింది. అయితే చనిపోయేముందు అనేక మంది ప్రవర్తన దాదాపుగా ఒకేలా ఉంటుందని జూలీ అంటుంది. ఇంకాసేపట్లో మరణించే అవకాశం ఉన్న వ్యక్తుల్లో అనేక మంది ఒకే విధమైన విషయం చెప్పడం గమనించిందట!

మరణించేముందు శరీర రంగు మారడం, జ్వరం, తమకి అత్యంత ప్రియమైన వారి పేరును పదే పదే తలచుకోవడం వంటివి చేస్తారట. ఎక్కువ మంది ‘ఐ లవ్‌ యూ’ అని అనడమో, గతంలో మరణించిన వారి తల్లిదండ్రులకు ఫోన్‌ చేయడం వంటి పనులు చేస్తారట.

అంతేకాకుండా రోగుల్లో చాలా మంది చనిపోయే ముందు నీడలను చూడటం ప్రారంభిస్తారని పేర్కొంది. తమకి అత్యంత ప్రియమైనవాళ్లు అంటే (అప్పటికే మరణించిన) వారి నీడలను చూడటం, ఇంటికి వస్తున్నానని చెప్పడం చేస్తారట. చాలా మందికి మరణం గురించి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు తనకు తెలుసని టిక్‌టాక్‌ ద్వారా ఓ వీడియోను ఆరు నెలల క్రితం పోస్ట్ చేసింది.

మనిషికి దేన్ని అయినా తెలుసుకోవటం అంటే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కదా..అలానే ఈ విషయాన్ని కూడా ఆసక్తిగా షేర్ చేసుకున్నారు… సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో తెగ వైరల్ అయిందిలే.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news